కేసీఆర్‌కు ఒక్క నోటీస్‌ ఇస్తేనే ఆగమాగం అవుతుండు… సీఎం రేవంత్ రెడ్డి..

బీఆర్‌ఎస్‌పై మరోసారి ద్వజమెత్తారు సీఎం రేవంత్‌రెడ్డి,. బీఆర్‌ఎస్‌ అంటే దయ్యాల రాష్ట్ర సమితి అంటూ విమర్శించారు. తమ పార్టీ బీఆర్‌ఎస్‌లో దెయ్యాలు చేరినయి అని సొంతింటి బిడ్డనే అంటోందని సీఎం రేవంత్‌ ఇక్కడ ఉదహరించారు…జిల్లాలోని తుర్కపల్లి మండలం తిర్మలాపూర్‌ సభలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. పదేళ్లలో మొదటి తారీఖే జీతాలు పడ్డాయా అని ఉద్యోగుల కుటుంబాలని అడుగుతున్నా.

ఇన్ స్టాల్ మెంట్లలో జీతాలు ఇచ్చినోడు నన్ను ప్రశ్నిస్తాడా?, బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణగా మార్చినోళ్లు నన్ను విమర్శిస్తారా?,కల్వకుంట పాలన చేసినోళ్ల కల్వకుంట్ల కుటుంబమోళ్లు. వాసాలమర్రిలో ఆకుల ఆదవ్వకు అల్లనేరేడు పళ్లు ఇచ్చాడు. ఆమె ఆస్పత్రిలో పడింది. వాసాలమర్రిని స్మశానంగా మార్చాడు

పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందన్నట్లు వాసాలమర్రిని కేసీఆర్ అలా చేశాడు. యాదగిరి గుట్టను యాదాద్రి గా మార్చారు. దాన్ని తిరిగి యాదగిరిగుట్టగా మార్చాం. టీటీడీ తరహాలో యాదగిరి గుట్టకు పాలకవర్గం ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ కాలేజ్, విద్యా సంస్థలను యూనివర్సిటీగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటాం.

తాటిచెట్టు అంత ఎదిగి మోకాళ్లలో మెదడు ఉన్న ఒకాయన గంధమల్ల రిజర్వాయర్ గురించి మాట్లాడుతున్నాడు. రెండు లక్షల కోట్లు ఇరిగేషన్ కోసం కేటాయింస్తే నల్లగొండలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదు. ఎవరు అడ్డం వచ్చినా మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చేసి చూపిస్తాం

గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా ప్రక్షాళన చేసుకున్నారు. కానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?,మూసీ మురికిలోనే మేం చావాలో బీజేపీ నేతలు చెప్పాలి. పుట్టబోయే బిడ్డలు కాళ్లు, కన్నులు వంకరపోతే బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా?, మేం మీ ఎర్రవెల్లి, జన్వాడ ఫాంహౌస్‌ను గుంజుకుంటామని అనలేదు కదా?, మూసీ కట్టొద్దనే, ప్రక్షాళన చేయద్దనే ప్రతి పక్షాలు అడ్డుకుంటున్నాయి. పదేళ్లలో ఎస్సెల్బీసీ, గంధమల్ల, పిల్లాయిపల్లిని ఎందుకు పూర్తిచేయలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఎందుకు నిర్మించలేదు’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఒక్క నోటీస్‌ ఇస్తేనే ఆగమాగం అవుతుండని, నెలల తరబడి జైల్లో ఉన్న తనకు ఇంకేం అనిపించాలని రేవంత్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు…