భర్తను కొట్టి చంపిన భార్య, నిద్రిస్తున్న భర్తపై సత్తితో దాడి .గుండాలలో ఘటన.

భర్తను కొట్టి చంపిన భార్య
-నిద్రిస్తున్న భర్తపై సత్తితో దాడి
-గుండాలలో ఘటన.

గుండాల: గుండాల మండల కేంద్రంలో నిద్రిస్తున్న భర్తను భార్య సత్తితో కొట్టి చంపిన ఘోరమైన ఘటన శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మాదరబోయిన బిక్షం(64) శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా ఆయన భార్య మాదరబోయిన ఉపేంద్ర సుత్తితో బిక్షం తలపై బలంగా కొట్టి చంపింది. అనంతరం ఉపేంద్ర పోలీస్ స్టేషన్ ఎదుట నిలబడి ఉండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి విచారించగా తన భర్తను చంపినట్లు తెలిపి పోలీసులకు లొంగిపోయింది. క్లూస్ టీం పోలీసులు వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. కాగా ఉపేంద్ర మానసిక స్థితి మొదటి నుంచి బాగోలేదని గ్రామస్తులు తెలిపారు. తెల్లవారుజామున ఘటన స్థలాన్ని యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, ఆత్మకూరు సీఐ హనుమంతు, గుండాల ఎస్సై తేజం రెడ్డి, యాదగిరిగుట్ట ఎస్సై రూప శ్రీ, క్లూస్ టీం పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు……