ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో నివాసం ఉండే భార్యాభర్తలు లక్ష్మణ్ నాయక్(38), పద్మ(30)
గత నెల 25న లక్ష్మణ్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అతని తమ్ముడు
2024లో డీఎస్సీలో ఎంపికై ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న పద్మ
ఈ క్రమంలో పద్మకు, తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న రాత్లావత్ గోపి అనే ఉపాధ్యాయుడితో ఏర్పడిన వివాహేతర సంబంధం
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలని.. గత నెల 24న రాత్రి పడుకొని ఉన్న లక్ష్మణ్ నాయక్ ముక్కు, నోటిఫై గుడ్డతో మూసి ఊపిరాడకుండా చంపేసిన పద్మ, గోపి
మర్నాడు ఉదయం ఏమి తెలియనట్లు పాఠశాలకు వెళ్ళి, ఇంటి యజమానికి ఫోన్ చేసి, తన భర్త ఎంత ఫోన్ చేసినా ఎత్తడం లేదని, తనకు భయంగా ఉందని ఆందోళనగా నటించిన పద్మ
తాను ఇంటికి రాగానే ఇంట్లో భర్త చనిపోయి ఉన్నాడని పద్మ నమ్మించగా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి తమ్ముడు
తమదైన శైలిలో విచారణ జరిపి, అక్రమ సంబంధం వల్లే హత్య జరిగిందని వాస్తవాలను రాబట్టి పద్మ, గోపిలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన పోలీసులు..