శవాలపై అత్యాచారం.. డ్రైనేజీలో నిండిపోయిన అస్థిపంజరాలు..పిల్లలను చంపి.. తిని…!

నిఠారి నోయిడా సీరియల్ మర్డర్ కేసు గురించి విన్నారా? ఒక యజమాని, నౌకర్ కలిసి ఏకంగా 19మంది పిల్లలను పొట్టన పెట్టుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..2006లో నిఠారీ గ్రామంలో పిల్లలు మిస్ అవ్వడం మొదలైంది. కానీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అయితే పాయల్ అనే 21ఏళ్ల యువతి మిస్ అయ్యాక.. ఆమె తండ్రి పదే పదే పోలీసుల దగ్గరికి వెళ్లడం జరిగింది. మొత్తానికి నాలుగోసారికి కేసు ఫైల్ అయింది. విచారణ మొదలైంది. డి5 బిల్డింగ్ దగ్గర ఆమె ఫోన్ సిగ్నల్ ఆగిపోయింది. అది వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పంధేర్ నివాసానికి ట్రాక్ చేయగా.. ఆ చుట్టు పక్కల సెర్చ్ చేస్తే భవనం వెనుక ఉన్న నాలాలో అస్థిపంజరాలు, తలలు, కాళ్లు, చేతులు.. ఇలా ఒక్కో బాడీ పార్ట్స్ దొరికాయి.

ఇంటి ఓనర్ పంధేర్, పని మనిషి సురీందర్ కోలీలను నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే స్థానిక పోలీసుల జాప్యంతో కేసు సీబీఐకి అప్పగించబడగా.. నౌకరి పిల్లలను కిడ్నాప్ చేసి.. వారిపై అత్యాచారం చేసి, చంపి, కొన్నిసార్లు నరమాంసాన్ని తిన్నాడని గుర్తించారు. ఇలా చంపిన శవాలపై యజమాని అత్యాచారం చేసేవాడని తేలింది. అవయవాల వ్యాపారం జరగొచ్చని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదిక సూచించినా సీబీఐ పట్టించుకోలేదని విమర్శలు కూడా వచ్చాయి. మొత్తానికి బాధితులు వెనుకబడిన వారు కావడం, ఆర్థికంగా బలంగా లేకపోవడంతో సాక్ష్యాలను కోర్టుకు సమర్పించలేకపోయారు. దీంతో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు….