నేటి పంచాంగం.. నేటి విశేషం.

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🏵️పంచాంగం🏵️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 14 – 08 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
బహుళ పక్షం,

తిథి : *పంచమి* ఉ6.10 వరకు,
తదుపరి *షష్ఠి* తె3.48 వరకు,
నక్షత్రం : *రేవతి* ఉ11.42 వరకు,
యోగం : *శూలం* సా4.33 వరకు,
కరణం : *తైతుల* ఉ6.10 వరకు,
తదుపరి *గరజి* సా4.59 వరకు,
ఆ తదుపరి *వణిజ* తె3.48 వరకు,

వర్జ్యం : *రా12.23 – 1.54*
దుర్ముహూర్తము : *ఉ9.58 – 10.49,*
మరల *మ3.01 – 3.52,*
అమృతకాలం : *ఉ9.27 – 10.57,*
మరల *తె3.24 – 4.54,*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 5.45,
సూర్యాస్తమయం: 6.24,

*_నేటి విశేషం_*

*🙏\|/🙏నేడు బలరామజయంతి 🙏\|/🙏*
\|/బలరామావతారము అంటే మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఇది ఒకటి. బలరాములు వారు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము , నాగలి.
వీరు గొప్ప వీరులు , దయామయులు , కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు, వీరి భార్య రేణుక.

🙏\|/ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు , మరొకసారి హస్తినాపురాన్నే నేటి ఢిల్లీని తన హలాయుధంతో యమునలో కలప ఉద్యుక్తులయినారు.
వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసినారు.
శ్రీకాకుళం జిల్లా నాగావళి నది ఆవిర్భావానికి … నాగావళి నదీతీరాన పంచలింగాల ప్రతిష్టకి ఈయనే కారణము.

🙏\|/భారత భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తావన వచ్చిన కొన్ని కొన్ని సందర్భాలలో బలరాముడిని గురించి కూడా కొన్ని వివరణలు , కథలు కనిపిస్తాయి. బలరాముడు భగవానుడి దశావతారాలలో ఒక అవతారంగా కూడా ఉన్నాడు.

శ్రీమహావిష్ణువు శ్వేతతేజస్సు బలరాముడుగానూ , నీల తేజస్సు శ్రీకృష్ణుడిగానూ అవతరించి దుష్టశిక్షణ కోసం తమ అవతార కాలాన్నంతా సద్వినియోగం చేసినట్లుగా అనిపిస్తుంది.
దేవకీదేవికి సప్తమగర్భం కలిగింది. అప్పుడు దేవకిని , వసుదేవుడిని కంసుడు చెరసాలలో బంధించాడు. ఆ సమయంలో యముడు తన యామ్యమైన మాయతో దేవకీదేవి నుంచి గర్భాన్ని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు.

బలరాముడికి ఈ సందర్భంలోనే సంకర్షణుడు అనే పేరు వచ్చింది.

🙏\|/సంస్కృత మర్యాద ప్రకారం సమ్యక్‌ కర్షణాత్‌ అంటే సంపూర్తిగా ఆకర్షించడం వల్ల ఆయన సంకర్షణుడు అనే పేరుతో కూడా మనకు కనిపిస్తాడు. బలవంతులందరిలోనూ శ్రేష్టుడు కనుక బలదేవుడు అన్నారు.

🚩 రామశబ్దానికి సుందరం అనే అర్ధం ఉంది కనుక ఆయన బలరాముడయ్యాడు. శ్రీకృష్ణుడికి అన్న అయిన బలరాముడు ఆదిశేషుడి అవతారం కూడా. సాందీప్‌ అనే గురువు దగ్గర బలరామకృష్ణులిద్దరూ విద్యాభ్యాసం చేశారు.
ఈ బలరాముడు శ్రీకృష్ణుడిలాగే పాండవులంటే కొంత ఆదరాభిమానాలు కలిగివున్నా ఈయనకు కౌరవులలో దుర్యోధనుడంటే కూడా బాగా ఇష్టం అని కొన్ని కొన్ని భారత కథాఘట్టాల వల్ల తెలుస్తుంది.
ఈయన భార్య పేరు రేవతీదేవి.
నాగలి , రోకలి , బలరాముడి ప్రధాన ఆయుధాలు. ఎప్పుడూ నీలరంగు వస్త్రాలనే ధరిస్తుంటాడు.
ఈయన జండామీద తాటిచెట్టు గుర్తు ఉంటుంది. గధాయుధంలో బలరాముడు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు.
భీముడు , దుర్యోధనుడు ఇద్దరూ ఈయన దగ్గర గదాయుద్ధ విద్యను నేర్చుకున్నారు.

🙏\|/విశేషించి దుర్యోధనుడు , పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు భీముడిని జయించాలన్న లక్ష్యంతో ఈయన దగ్గర ఎన్నెన్నో గదాయుద్ధ మెళుకవలను నేర్చుకున్నాడు. ద్రౌపది వివాహంలోనూ , ధర్మరాజు ఇంద్రప్రస్థ రాజధాని ప్రవేశ సమయంలోనూ శ్రీకృష్ణుడితోపాటుగా బలదేవుడు కూడా ఉన్నాడు. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ చిన్ననాటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సుభద్రను వివాహమాడటంకోసం యతి వేషంలో బలరాముడు దగ్గరకు వెళ్ళాడు.
ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సహకరించాడు కూడా.
కానీ అర్జునుడు సుభద్రను అపహరించి చేపట్టడం బలరాముడికి నచ్చలేదు.

🙏\|/అర్జునుడి సాహసాన్ని క్షమించలేనని బలరాముడు తీవ్రంగా కోపగించుకున్నాడు. అయితే శ్రీకృష్ణుడు అతడిని శాంతపరిచి కోపం తగ్గించుకునేలా చేశాడు. పాండవులు వనవాసం చేసే రోజుల్లో తీర్థయాత్రలు చేస్తూ ప్రభాసతీర్థం దగ్గరకు వెళ్ళినప్పుడు బలరాముడు , మరికొందరు యాదవ వీరులను తీసుకొని వారిదగ్గరకు వెళ్ళి వారిని పరామర్శించాడు. ఆ తర్వాత వనవాసం , అజ్ఞాతవాసం అన్నీ పూర్తికావటం ఉత్తర , అభిమన్యుల వివాహం కూడా జరిగాయి. ఆ సందర్భంలో అక్కడ ఉన్న బలరాముడు పాండవులకు , కౌరవులకు హితకరంగా రాజ్యవిభాగం ఎలా జరిగితే బాగుంటుందో ఆలోచించాలన్నాడు. ఇక్కడే ఇతడికి దుర్యోధనుడంటే అభిమానం ఉందన్న విషయం వ్యక్తమవుతుంది.

🙏\|/అయితే యుద్ధసమయంలో పాండవులు , కౌరవులు ఇద్దరూ తనకు కావాల్సివారేనని కనుక తాను ఏ పక్షానికి ఎలాంటి సహాయం చేయకుండా తటస్ఠంగా ఉన్నాడు. ఈ తటస్ఠ లక్షణాన్ని నిలుపుకోవడానికి ఆయన కురుక్షేత్ర యద్ధ సమయంలో సరస్వతీ నదీ తీరంలో ఉన్న తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళాడు. నలభైరెండురోజుల తీర్థయాత్ర ముగించుకొని కురుక్షేత్ర సంగ్రామం చిట్టచివరిలో భీముడు , దుర్యోధనుడు గదాయుద్ధం చేసుకునే సమయానికి తిరిగి వచ్చాడు.

🙏\|/ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలు విరగగొట్టడం గదాయుద్ధ ధర్మం కాదని తీవ్రంగా తన నిరసనను , ఆగ్రహాన్ని వ్యకపరిచాడు. అయితే శ్రీకృష్ణుడు కలగజేసుకొని దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి శాపం ఉందని , దాంతోపాటుగా భీముడు చేసిన ప్రతిజ్ఞ కూడా ఉందని గుర్తుచేసి సర్దిచెప్పడంతో కొద్దిగా బాధపడుతూనే రథమెక్కి ద్వారకకు వెళ్ళాడు. కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత కొద్దికాలానికి మహర్షుల శాపం వలన యాదవ వంశం నాశనమైంది.

*_🏵️శుభమస్తు🏵️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏