వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నరాలకు టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హత్య చేసిన భార్య..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నరాలకు టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హ*త్య చేసిన భార్య..

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాలకల్ గ్రామంలో దారుణం

భర్త ప్రశాంత్ కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళగా.. బంటి అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య సంధ్య

ఇటీవల ప్రశాంత్ తిరిగి రాగా, భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసి ఇద్దరి మధ్య తరచూ గొడవలు

దీంతో గత నెల 30న ప్రియుడు బంటితో కలిసి పథకం వేసి, భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి ఇంటిపై నుండి కిందికి తోసేసిన సంధ్య

ప్రశాంత్‌కు గాయాలు అవ్వగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన కుటుంబసభ్యులు

అక్కడ ప్రియుడితో కలిసి సిరంజ్‌ సహాయంతో నరాల్లోకి హార్పిక్ ఎక్కించి భర్తను చంపి, మద్యం మత్తులో ఇంటిపై నుండి పడి చనిపోయాడని నమ్మించిన భార్య..

శవాన్ని పోస్ట్‌మార్టం చేయగా బయటపడ్డ అసలు గుట్టు.. పోలీసులు విచారించగా అసలు నిజం ఒప్పుకున్న సంధ్య..

భార్య సంధ్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..