అప్పుడే పుట్టిన పసికందును ఆలయ పరిసరాల్లో వదిలేసిన వ్యక్తులు..!

బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి ఆలయం వద్ద అప్పుడే జన్మించిన ఆడ శిశువును వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు……..

ఓ తల్లి కన్నపేగును వదిలించుకున్నది. అప్పుడే పుట్టిన పసికందును ఆలయ పరిసరాల్లో వదిలేసి వెళ్లింది. ఈ అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటిలో చోటు చేసుకుంది.

పడమటిలోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికి పాప ఏడుపులతో చిన్నారిని స్థానికులు గమనించారు. పాపను ఎవరి వదిలి వెళ్లారు? అనేదానిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959