ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై తమ చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఘన విజయం సాధించింది..అయితే ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది ఏడో పరాజయం కావడం గమనార్హం. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ టీమ్ అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
ప్రస్తుత లీగ్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ జట్టు 2 సార్లు గెలుపొందగా.. 7సార్లు ఓటమిని చవిచూసింది. దీంతో ఆ టీమ్ ప్లేఆఫ్స్ అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యమే అని చెప్పవచ్చు. లీగ్ దశ నుంచి తప్పుకొనే తొలి టీమ్‌గా ముంబై నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌ల్లో గెలుపొంది.. 5 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే సీఎస్కే జట్టు తదుపరి మ్యాచ్ ఫలితాల ద్వారా దాని ప్లేఆఫ్స్ అర్హత సాధించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తవ్వగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కనీసం 7 లేదా 8 మ్యాచ్‌ల్లో కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే 14 లేదా 16 పాయింట్లను సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైనా రెండు జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం సమానంగా ఉంటే.. వాటి నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరుతాయి. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే 12 పాయింట్లను సాధించినందున, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌లకు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువ.
శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బ్యాటింగ్ ఎంచుకోగా.. విల్ జాక్స్ తక్కువ స్కోరుకే అవుటైనా ఫర్వాలేదనిపించేలా ఆరంభాన్ని ఇచ్చాడు. సగం ఆట ముగిసేసరికి, ముంబై జట్టు 180కి పైగా పరుగులు చేస్తుందని అనిపించింది. అయితే, సూపర్ కింగ్స్ పద్ధతిగా పరుగులు చేయడాన్ని నియంత్రించి, ముంబై ఇండియన్స్‌కు బ్రేకులు వేసింది. దీంతో ముంబై జట్టును 159 పరుగులకే పరిమితం చేసింది.
లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో సంజు సామ్సన్ను 11 పరుగులకే అవుట్ చేసి ముంబై ఇండియన్స్ ‘ఎల్లో ఆర్మీ’కి ఆరంభంలోనే దెబ్బకొట్టింది. కానీ, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఉర్విల్ పటేల్, వేగంగా 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రుతురాజ్ గైక్వాడ్ (67*), కార్తీక్ శర్మ (54*) అజేయంగా 98 పరుగులు జోడించారు. ఇంకా 11 బంతులు, 8 వికెట్లు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది.
అందుకే ఓడి పోయాం…
బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. చెపాక్ పిచ్‌కు అనుగుణంగా లెక్కలతో కూడిన బ్యాటింగ్ చేయలేకపోయామని తెలిపాడు..p
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్ తమకు ఏమాత్రం కలిసి రాలేదని, ఈ మ్యాచ్‌లో తమ ప్రదర్శన అన్ని విభాగాల్లోనూ వెనుకబడిందని పాండ్యా అభిప్రాయపడ్డాడు. “ఇది మా సీజన్ కాదు. వారు మాకంటే మెరుగ్గా ఆడారు. మెరుగ్గా బౌలింగ్ చేశారు. మెరుగ్గా ఫీల్డింగ్, బ్యాటింగ్ చేశారు. 180-190 పరుగులు ఒక మంచి స్కోరు అయ్యేది. మాకు కావాల్సిన మూమెంటమ్ లభించలేదు. మొత్తంగా చూస్తే, ఒక బౌలింగ్ యూనిట్‌గా వారు మాకంటే మెరుగ్గా ఉన్నారు. కానీ ఒక బ్యాటింగ్ యూనిట్‌గా మేము అంత గొప్పగా రాణించలేకపోయాము. మాకు అందుబాటులో ఉన్న బౌలింగ్ ప్రత్యామ్నాయాలతోనే మేము ముందుకు వెళ్లాము” అని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు..
అదరగొట్టిన రుతురాజ్, కార్తీక్ శర్మ
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. నమన్ ధీర్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/32) మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. రామకృష్ణ ఘోష్, జేమీ ఓవర్టన్ తలో వికెట్ తీసారు.
అనంతరం సీఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67 నాటౌట్), కార్తీక్ శర్మ(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఉర్విల్ పటేల్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24) దూకుడుగా ఆడాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, అల్లా ఘజన్ఫర్ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.