సీవీ ఆనంద్ సారు కి కోపం వచ్చిందీ…!!.సీవీ ఆనంద్ క్షమాపణలు.. సహనాన్ని కోల్పోయానంటూ పోస్ట్…!
మీడియాకి సారి చెప్పినా..సీవీ ఆనంద్..
సంధ్య థియేటర్లో తొక్కిసలాట వ్యవహారంలో అన్ని వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఏ వ్యవస్థ వల్ల తప్పు జరిగిందన్న వాదనలు జరుగుతూనే ఉన్నా తప్పు జరిగిపోయింది..ఆ తర్వాత ఏం జరగాలి ?. తప్పు చేసిన వారిని శిక్షించాలి.. మరోసారి అలాంటివి జరగకుండా చూసుకునేందుకు ప్రయత్నించాలి. కానీ జరుగుతోంది వేరు. ఫలితంగా పోలీసులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు.
ఎప్పుడూ కూల్ గా ఉండే కమిషనర్ సీవీ ఆనంద్ కూడా తన కోపం తెచ్చుకున్నారు. నేషనల్ మీడియాను అమ్ముడుపోయారని మండిపడ్డారు. ఆయన నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ఊహించలేకపోయారు. దీనికి కారణం నేషనల్ మీడియా పోలీసుల వాదనను ప్రజలకు చూపించకపోవడమే అని అంటున్నారు. కారణం ఏదైనా ఆయన మీడియాపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దాంతో ఆయన క్షమాపణ చెప్పాలి వచ్చింది…కమిషనర్ సీవీ ఆనంద్ కేసులన్నింటినీ ఒకేలా చూస్తారు. సెలబ్రిటీ కేసు..మామూలు కేసు అన్నది కాదు. తప్పు చేసిన వారిని బయటకు తేవాలన్న లక్ష్యంతో పని చేస్తారు. ఏ కేసు విషయంలోనూ ఆయన ఒత్తిడికి గురయినట్లుగా ఇప్పటి వరకూ ఎవరూ చెప్పుకోరు. కానీ మొదటి సారి పోలీసులపై నింద పడుతూంటే.. తమ వాదన ప్రజల్లోకి వెళ్లడం లేదన్న అభిప్రాయంతో ఆయన జాతీయ మీడియాపై నోరు జారారు. కానీ వెంటనే దిద్దుకున్నారు..
నేను చేసింది పొరబాటుగా భావిస్తున్నాను. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. క్షమాపణలు కోరుతున్నా” అని తెలిపారు.
మరోవైపు సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానమిచ్చారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను ఆయన విడుదల చేశారు. ఇక ఈ ఘటనపై తాజాగా సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్పై కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయమన్నారు. ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా నేతలు యత్నిస్తున్నారన్నారు. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాలని.. ఇలాంటి ఘటనలు జరగకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు…