రాజకీయ పాటలపై సజ్జనార్ హెచ్చరిక…దానం నాగేందర్‌తో కలిసి మహిళా పోలీసులు నాని పాటకు స్టెప్పులు..!

హైదరాబాద్: వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు, రెచ్చగొట్టే లేదా అసభ్యకర పాటలు ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ చేసిన హెచ్చరిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. నిమజ్జన కార్యక్రమాలను భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. సోషల్ మీడియా రీల్స్‌ను కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు..

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు సీపీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిమజ్జన ఊరేగింపుల్లో కేసీఆర్, బీఆర్ఎస్‌కు సంబంధించిన పాటలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ హెచ్చరికలు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం తమ చర్యలు రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకున్నవి కావని, అసభ్యకర, రెచ్చగొట్టే పాటలు, అధిక శబ్దాలు, నిబంధనల ఉల్లంఘనల నియంత్రణలో భాగమేనని చెబుతున్నారు..
https://x.com/r9telugunews/status/2103371764583842184?s=20
ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన ఓ నిమజ్జన వీడియో సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. వీడియోలో దానం నాగేందర్‌తో కలిసి మహిళా పోలీసులు పాటకు స్టెప్పులు వేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. అయితే ఆ వీడియోకు సంబంధించిన పూర్తి సందర్భం, పాట ఎప్పుడు, ఎక్కడ, ఏ నిబంధనల పరిధిలో ప్రసారమైందన్న వివరాలు స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది.
దీంతో సోషల్ మీడియాలో పలువురు యువతతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా “రాజకీయ పాటలపై చర్యలు తీసుకుంటామని చెప్పిన పోలీసులు.. ఇలాంటి సందర్భాల్లో అదే నిబంధనలు వర్తిస్తాయా?” అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు..

ఈ వ్యవహారంపై సీపీ సజ్జనార్ ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.