ఎమ్మెల్యే అంటే అధికారులకు గౌరవం లేకుండా పోయింది..
అధికారులకు సిగ్గుండాలి.. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగలేరా?..
ప్రోటోకాల్ పాటించలేదంటూ ప్రభుత్వ అధికారుల మీద చిందులేసిన దానం నాగేందర్..
అప్లై చేసిన అందరికీ ప్లాట్లు రాకపోతే అధికారుల గల్లా పట్టి ఇప్పిస్తా..
బంజారాహిల్స్లోని కొమురంభీమ్ ఆదివాసీ భవన్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ రాకముందే ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రా నిర్వహించిన అధికారులు..
దీంతో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని రెచ్చిపోయిన దానం నాగేందర్..
ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకుంటే ఇక ఎమ్మెల్యే ఉండేది ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దానం నాగేందర్. లక్కీ డ్రా నిర్వహిస్తున్న అధికారి నుంచి దానం నాగేందర్ మైక్ లాక్కోవడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు..
స్థానిక శాసనసభ్యుడికి (ఎమ్మెల్యేకు) ఎలాంటి సమాచారం లేదా గౌరవం ఇవ్వకుండా, అధికారులే స్వయంగా లక్కీ డ్రా నిర్వహించి ఇళ్లను కేటాయించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు….ఈ విషయమై అధికారులపై ప్రివిలేజ్ నోటీస్ (సభా హక్కుల ఉల్లంఘన నోటీస్) జారీ చేస్తానని దానం నాగేందర్ హెచ్చరించారు..
విధుల్లో ఉన్న అధికారుల పట్ల “సిగ్గుండాలి”, “భయం లేకుండా పోయింది” అంటూ ఎమ్మెల్యే మాట్లాడిన తీరుపై, అలాగే “గల్లా పట్టి ఇళ్ళు ఇప్పిస్తా” అని వ్యాఖ్యానించడంపై నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు..