సూర్యాపేట జిల్లాలో బీహార్ కూలీలు బీభత్సం చేశారు. రోడ్లపై వీళ్ల విధ్వంసం చూసి భయంలో పరుగులు తీశారు పోలీసులు. జనం అయితే వణికిపోయారు. పాలకీడు మండలం జాన్ పాడు డక్కెన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన ఘటన సంచలనంగా మారింది…
స్థానికులు పనిచేస్తున్న పలువురు తెలిపిన వివరాల ప్రకారం….
బీహార్ కు చెందిన ఓ కార్మికుడు హార్ట్ ఎటాక్ తో మృతి చెందడం జరిగింది.. బీహార్ కార్మికుడిని ఎటువంటి పోస్టుమార్టం లేకుండా తన తోటి కార్మికులు ఆదివారం రోజు బీహార్ కి పంపించడం జరిగింది.. … వారి కుటుంబ సభ్యులు నేడు డెక్కన్ సిమెంట్ వద్దకు వచ్చి చనిపోయిన కార్మికుడికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేసి ధర్నా చేయగా… 5 లక్షలు ఇస్తామనడంతో డెక్కన్ సిమెంట్ లోని కాంట్రాక్టర్ తో చర్చలు జరుపుతున్న సమయంలో,,.. ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం మొదలైంది…..
కార్మికులు అద్దాలు పగలగొట్టి హంగామా సృష్టించారు… పోలీసులకు బీహార్ కార్మికులకు మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయిలో పెరగడంతో, ఒక్కసారిగా ఆగ్రహించిన కార్మికులు పోలీసులుపై కూడా దాడి చేశారు..
సేకరణ.
షేక్. మహబూబ్ అలీ.