జాతీయ రహదారిపై బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బాదలాపురం వద్ద కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు.. సన్నాల సాగును ప్రభుత్వం ప్రోత్సహించడం. ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ సైతం అందిస్తామని ప్రకటిం చింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఈ సీజన్లో సన్నదాన్యాన్ని అత్యధికంగా సాగు చేశారు. సుమారు ఏడు లక్షల ఎకరాల్లో సన్న ధాన్యం సాగవగా.. 16లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 40శాతం వరి కోతలు పూర్తయ్యాయి. వర్షాలు కురుస్తా యన్న ఆందోళన, మిల్లర్లు సైతం మంచి ధర ఇస్తుండడంతో రైతులు సన్నాలను మిర్యాలగూడ మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇక్కడి మిల్లర్లే సుమారు 4 లక్షల టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేసినట్లు అంచనా…