ఎన్నో జన్మల పుణ్యఫలమే, ధ్యానం…యోగాచార్యులు షేక్ బాహర్ అలీ.

డిసెంబర్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది..

పీస్ యోగ విద్యాలయం వారు శ్రద్ధ శ్రీ యోగాచార్యులు షేక్ బాహర్ అలీ ఖమ్మం పట్టణంలో జెడ్ పి హెచ్ ఎస్ పాండురంగపురంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి హేమలత గారి ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూలు పి ఈ టి నాగ ప్రసాద్ గారు ఉపాధ్యాయ ఉపాధ్యాయునిలు మరియు విద్యార్థిని విద్యార్థులు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

.world meditation day) ప్రతి ఏటా డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నాం.ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి,అంతర్గత శాంతిని పెంపొందించుకోవటానికి ధ్యానం యొక్క ప్రాముఖ్యత చాటుతుంది. అదే సమయంలో ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఆయనాంతం రోజు కూడా, ఇది సంవత్సరంలో అతి తక్కువ పగల రోజు, మరియు పొడవైన రాత్రిని సూచిస్తుంది.ఇది ఆధ్యాత్మిక పునర్జీవనానికి అనుకూలమైన రోజుగా భావిస్తారు..

ఎన్నో జన్మల పుణ్యఫలమే,ఈ మానవ జన్మ ఎత్తడానికి కారణం. ఈ జన్మ సార్ధకత చేసుకోవడానికి మంచి మార్గం నడవటానికి, ఉత్తమమైన మార్గం ఆధ్యాత్మిక మార్గం.ఈ మార్గంలో నడిచినట్లైతే ఆరోగ్యపరంగా,ఆధ్యాత్మికంగా ఉండటం జరుగుతుంది.మనలో ఉన్నటువంటి కామ, మద,మోహ, అహంకారం, ఈర్ష్య,అసూయ వీటన్నింటినీ తొలగించుకుంటూ, మనలో కరుణ,జాలి,దయ, ప్రేమానురాగాలని,శాంతిని,మరియు శారీరక మానసిక ఆనందాన్ని పొందటానికి ఆధ్యాత్మిక మార్గమే సరైనదిగా చెప్పటం జరుగుతుంది. ప్రతిరోజు ఓడిదడుగులతో నడిచే జీవితాన్ని,ఆ జీవితంలో వచ్చేటటువంటి ఇబ్బందులు, ఒత్తిడి,శ్రమ, అనారోగ్యాలు వీటన్నింటినీ తగ్గించుకోవటానికి ధ్యాన మార్గం చాలా సులువైనది. అందుకే అందరూ ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు.

అష్టాంగా యోగ మార్గలైన యమ, నియమ,ఆసన,ప్రాణాయామ, ప్రత్యహార,ధారణ,ధ్యాన, సమాధి మార్గాలు అయినటువంటి దానిలో ధ్యానానికి కూడా విశేష మహత్వం కలదు. ఏదైనా ధ్యానం చేసేటపుడు సుఖాసనం గాని వజ్రాసనం గాని సిద్ధాసనం గాని పద్మాసనం గాని దానిలో కూర్చొని ఏదైనా ఒక ముద్ర వేసి ధ్యానం చేసినట్లయితే ఇంద్రియాలకు ప్రాధాన్యత కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది “నాస్తి ముద్రాసమం కించిత్ సిద్ధిథం క్షితిమండలే” అనగా ఈ పృథ్వి పై ముద్రల వలె సఫలత కలిగించునటువంటి ఏ ఇతర కర్మలు లేవు అని చెప్పబడినది. సౌకర్య దృష్టితో మన యొక్క మానసిక ఒత్తిడిని,శారీరక ఒత్తిడిని, రుగ్మతలను తొలగించుకోవడానికి ధ్యానంలో ధ్యానముద్ర వేసి కూర్చున్నట్లయితే ఆరోగ్యవంతులుగా మారుతాము.
ధ్యానం అన్నది సరళమైన అతి గొప్ప యోగాభ్యాసం. మనకు తెలియకుండానే మనం నిత్యజీవితంలో ప్రతి పనిని ధ్యానంతోనే చేస్తాము. ధ్యానం లేని పని చేయలేము. లేవటం, కూర్చోవటం, తినటం, తాగటం,ఆఫీసు,దుకాణము, చదవడం,చదివించటం, వంట పని చేయటము వంటి అన్ని పనులకు ధ్యానం అత్యవసరం. అయితే వీటిలో మనం పెట్టే ధ్యానం ఏ స్థాయిలో ఉంటుంది.ఈ ధ్యానంలో మనకు ఇష్టమైనది ఏది ? మనం ఏ ఉద్దేశంతో ధ్యానం చేస్తున్నాము అన్నవి ముఖ్య ప్రశ్నలు.
అసలు ధ్యానం అంటే ఏమిటి? శరీరాన్ని స్థిరం చేసుకున్న తర్వాత బయట వస్తువులతో సంబంధాలను విడగొట్టుకోవటమే ధ్యానం. మనసును నస్వర వస్తువు నుండి పరిస్థితుల నుండి ఆశక్తుల నుండి విడదీసి దానిని తన అసలు మూల స్వభావంతో కలిపి స్థిరం చేయటమే ధ్యానం. బుద్ధిని నిశ్చలంగా తటస్థంగా ఉంచగలగటమే ధ్యానం. మనసులోనికి తొంగి చూడగలగడమే ధ్యానం. చిత్తంలో జత కూడిన సంస్కారాల నొక్కుక్క దాన్ని వదిలించుకోవటమే ధ్యానం. ఈ విధంగా స్థూల,సూక్ష్మ కారణ శరీరాలను ధ్యానానికి అనుకూలంగా తయారు చేసుకోవటమే ధ్యానం. కేవలం ధ్యానం వల్లనే మన వృత్తులన్నీ ఒక్క స్థానంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది.పతాంజలి యోగ సూత్రం ప్రకారం “ధ్యాన నిర్వీషయం మనః ” అంటే మనసు భావశూన్యము కావటమే ధ్యానం. ఈ ధ్యానం చేయనప్పుడు, మనకు అనుకూలమైనటువంటి ధ్యానముద్రలో కూర్చోవచ్చు.

ఈ బ్రహ్మాండమంతయు పంచతత్వములచే నిర్మితమై ఉన్నది.మన శరీరం కూడా పంచతత్వముల సంఘతమై ఉన్నది.శరీరం యొక్క ఐదు అంగుళీయములు ఈ పంచతత్వముల ప్రతినిదిత్వ మునుర్చుచున్నవి, బొటనవేలు అగ్నికి, చూపుడువేలు వాయువునకు, మధ్య వేలు ఆకాశమునకు, అనామిక పృద్వి యొక్క మరియు చిటికెన వేలు జలతత్వముల ప్రతినిధి త్వమొనుర్చుచున్నవి. పంచ తత్వముల సమిష్టి తత్వముల సమస్థితి వల్ల శరీరం ఆరోగ్యవంతంగా ఉండును.,మరియు ఇందుకు ప్రతికూల పరిస్థితిచే రోగములు ఉత్పన్నమగును. ముద్రావిజ్ఞానమును అనుసరించి ఈ పంచతత్వముల సమన్వయతముచే శరీరం యొక్క అందరికి గ్రంధులు అవయములు వాని క్రియలను నియమిత మొనర్చబడును. శరీరం యొక్క సుషుప్త (నిద్రించియున్న) శక్తులను జాగృతమోనర్చబడును.
ధ్యానం చేయు విధానము.
ముందుగా ప్రశాంతమైన వాతావరణం లో కూర్చోవాలి.
1. పరిశుభ్రమైన ప్రాంతంలోచక్కని గాలి వెలుతురు వచ్చే విధంగా వున్నచోటు ఒక దుప్పటి నేలమీద వేసి దానిమీద కూర్చోవలెను.
2. ఇప్పుడు ధ్యానముద్ర చేసేటపుడు. సుఖాసనం గాని వజ్రాసనంలో గాని కూర్చొని వెన్నుముకను నిటారుగా ఉంచి, చూపును నేలకు సమాంతరంగా ఉంచి, చూపుడువేలు బొటనవేలు పరస్పర పై భాగాలు ఒకదాని మీద ఒకటి ఆనించి మిగతా మూడు వేళలు చక్కగా ఉంచవలెను, ధ్యానముద్ర వేయవలెను. ఈ ముద్ర లో పది నుంచి 45 నిమిషాల వరకు కూర్చోవచ్చును.
3. ఈ ముద్ర వలన ప్రయోజనాలు.
4. ధారణ మరియు ధ్యానాత్మక స్థితులు వికాసం కలుగును.
5. ఏకాగ్రత పెంపొందును మరియు నకరాత్మక ఆలోచనలు తగ్గిపోవును
6. జ్ఞాపకశక్తి పెరుగును. నిరంతరం అభ్యాసం చేయటం వలన పిల్లలు, మేధావులు తేజోవంతులగును.
7. మస్తిస్కం నందలి స్నాయువులు శక్తివంతమగును. తలనొప్పి నిద్ర రాకుండా ఉండుట బిగిసి పోవటం దూరమగును. క్రోధము నశించును చక్కని పరిణామములు వృద్ధి అగును ఈ ముద్ర చేసిన తర్వాత ప్రాణముద్ర కూడా చేయవలెను.