రేవంత్ సర్కార్ పై మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ చీఫ్ కపిలవాయి దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నల్గొండ నుంచే సంక్షోభం పొంచి ఉందన్నారు. సామాజిక చైతన్య రథ యాత్రలో భాగంగా నల్గొండలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. 3 నెలల్లోగా ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డితో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు.
”3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తాడాయన. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. నాకు తెలిసిన వాళ్లే 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డితో టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పైసలు లేవు. ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఇంట్లో పడుకోవడం బెటర్. మూడు నెలల్లోగా మన నల్గొండ నుంచే ఈ ప్రభుత్వం పెద్ద సంక్షోభంలోకి నెట్టవేయబడుతుంది. ప్రభుత్వం కూలిపోవడం గ్యారెంటీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసం చేశారు. రిజర్వేషన్లపై జీవో ఇచ్చారు…