*’మొంతా’ తుఫాన్తో ఏపీలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు*
* APSDMA కంట్రోల్ రూమ్ నెం.112, 1070, 1800 425 0101
* శ్రీకాకుళం నెం. 08942-240557
* విజయనగరం నెం. 08922-236947
* విశాఖపట్నం నెం. 0891-2590102/100
* అనకాపల్లి నెం.08924-222888
* కాకినాడ నెం.0884-2356801
* కోనసీమ నెం. 08856-293104
* పశ్చిమ గోదావరి నెం.08816-299181
* కృష్ణా జిల్లా నెం. 08672-252572
* బాపట్ల నెం. 08643-220226
* ప్రకాశం నెం. 98497 64896
* నెల్లూరు నెం.0861-2331261, 79955 76699
* తిరుపతి నెం. 0877-2236007.
తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం కొన్ని ఈశాన్య జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని, మరికొన్ని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నెల 28 నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది : ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాగల 24 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశలో కదిలి మరింత బలపడి తుపానుగా మారి నైరుతి బంగాళాఖాతం, దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. తదుపరి ఈ తుపాను మొదట వాయవ్య దిశలో తదుపరి ఉత్తర వాయవ్య దిశలో కదిలి మరింత బలపడి ఈ నెల 28 నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. తదుపరి తూర్పు వాయువ్య దిశలోనే కదులుతూ ఈ నెల 28న సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం – కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు.
ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం : మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త కరుణ్ సాగర్ వెల్లడించారు. ఎల్లుండి కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమపై తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా తుఫాను తీరం దాటే సమయంలో సుమారు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అలలు ముందుకు వచ్చే అవకాశం ఉందని అన్నారు..