స్పామ్ కాల్స్ అనేవి తలనొప్పి తెప్పిస్తూ ఉంటాయి. రోజూ వేర్వేరు నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెస్సేజ్‌లు వస్తూ ఉంటాయి. ఒక నెంబర్‌ను బ్లాక్ చేసినా మరో నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ చేస్తూ ఉంటారు. కాల్ కట్ చేసినా అదే పనిగా చేస్తూ విసుగు తెప్పిస్తూ ఉంటారు. పర్సనల్ లోన్ కావాలా..? క్రెడిట్ కార్డ్ కావాలా..? ఇన్యూరెన్స్ తీసుకుంటారా..? అంటూ రోజూ కాల్స్ చేస్తూ ఉంటారు. వద్దని చెప్పినా మళ్లీ తర్వాతి రోజు కాల్ చేసి అడుగుతారు. మొబైల్ వినియోగదారులు ఇలాంటి స్పామ్ కాల్స్ బెడదతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మరికొంతమంది స్కామర్లు స్పామ్ కాల్స్‌తో బురిడీ కొట్టిస్తూ ఉంటారు..
కొందరు అదే పనిగా పదేపదిగా రిటర్న్ కాల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు.. కొన్ని బ్యాంకుల ద్వారా కూడా ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి దీన్ని అరికట్టేందుకు ఓ యాప్ రూపొందించడం జరిగిందంటూ సైబర్ క్రైమ్ తెలుపడం జరిగింది.. అత్యంత ఇంపార్టెంట్ అయిన మీటింగ్ లో ఉన్నప్పుడు కూడా పదేపదే రిపీట్ గా స్పామ్ కాల్స్ రావడంతో విసుగిపోతున్నరు..
డీఎన్డీ యాప్.
స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ట్రాయ్ డూ నాట్ డిస్టబ్(DND) యాప్‌ను లాంచ్ చేసింది. ట్రాయ్ డీఎన్డీ 3.0 పేరుతో యాప్ ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా స్పామ్ కాల్స్ రాకుండా మీరు సెట్టింగ్స్ ఆన్ చేసుకోవచ్చు. ఎలాంటి కాల్స్ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారనే ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇక స్పామ్ కాల్స్ గురించి ట్రాయ్‌కు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇది ప్రభుత్వ యాప్ కావడంతో మీ డేటాకు భద్రత ఉంటుంది. ఈ యాప్‌ను నిర్వహించేందుకు టెలికాం కంపెనీలతో కలిసి ట్రాయ్ పనిచేస్తుంది ఇక స్పామ్ కాల్స్ గురించి 1909కి కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. లేకపోతే cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959