నారాయణపేట జిల్లాలో అమానవీయ ఘటన…!

నారాయణపేట జిల్లాలో అమానవీయ ఘటన.

ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపేసి హత్య చేసి కాలువలో పడేసి, అనంతరం తండ్రి ఆత్మహత్యాయత్నం..

నారాయణపేట జిల్లా మరికల్ మండలం తేలేరులో పిల్లలకు అనారోగ్యంగా ఉందని, ఆసుపత్రికి తీసుకెళ్తానని, తన ఇద్దరు పిల్లలు రిత్విక్, చైతన్యలను బయటకు తీసుకెళ్లిన తండ్రి శివరాం.

అర్ధరాత్రి పొలం వద్దకు తీసుకెళ్లి చిన్నారులను ఉరి తీసి హత్య చేసి, కాలువలలో పడేసిన తండ్రి..

అనంతరం పురుగుల మందు తాగి, ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన శివరాం..

శివరాం పరిస్థితి విషమంగా ఉండడంతో, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు.

ఇటీవల శివరాంకు తన భార్యతో విడాకులు అయినట్లు పోలీసులకు సమాచారమిచ్చిన గ్రామస్తులు.

ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959