మిలటరీ విమానం కుప్పకూలి 14 మంది మృతి..

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌ కాంగో) దేశంలో చోటుచేసుకున్న ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు అత్యున్నత స్థాయి మిలిటరీ అధికారులతో పాటు మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోవడం ఆ దేశ సైన్యంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ పెను ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో దేశ సైన్యానికి చెందిన కీలక వ్యక్తులు ఉండటం గమనార్హం. మిలిటరీ కోర్టు ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటాలయ్ టియెండే, సాయుధ బలగాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఈ దుర్ఘటనలో దుర్మరణం చెందారు. వీరు కాక విమానంలో ప్రయాణిస్తున్న మిగతా ప్రతినిధులు, విమాన సిబ్బంది సహా మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారని ఆ దేశ సైనిక అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంగే ధృవీకరించారు..అసలు ఈ ప్రమాదం జరగడానికి గల అసలు కారణాలు ఏమిటనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు చైర్మన్ ట్రిఫాన్ కిన్-కియ్ ములుంబా వెల్లడించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. విమానం టెక్నికల్ కండిషన్ ఎలా ఉంది, చివరి క్షణాల్లో ఏం జరిగిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. కాగా, ఒకవైపు కాంగో తూర్పు ప్రాంతంలో ఆర్మీకి, పలు సాయుధ రెబెల్ గ్రూపులకు మధ్య తీవ్ర పోరు సాగుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం..

“ఈ ప్రమాదంలో ఇద్దరు జనరల్ అధికారులతో పాటు, ప్రతినిధి బృందంలోని పన్నెండు మంది సభ్యులు, సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు,” అని కాంగో సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంగే ఒక ప్రకటనలో తెలిపారు..

https://x.com/i/status/2103661686419071271