టీటీఏ వేడుకల ఛైర్మన్గా డాక్టర్ డీఎల్ నరసింహారెడ్డి..
డాక్టర్ నరసింహారెడ్డి క్యాన్సర్ వ్యాధి పై ప్రత్యేక నిపుణులు..
ప్రవాస భారతీయులకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అనే అభిప్రాయం…
టీటీఏ కు తనదైన శైలిలో సేవలందించడంలో ముందున్నారంటూ ప్రశంసలు…
అమెరికాలోని తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక 501(c) సేవా సంస్థ, జాతీయ సంస్థ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) స్థాపితమై నేటికి పదేళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ యేడాది డిసెంబరులో, హైదరాబాద్, తెలంగాణలో తన పదవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది.
ఈ వేడుకలు హైదరాబాద్లోని శిల్పకళావేదికలో అట్టహాసంగా జరగనున్నాయి.
ఈ వేడుకలకి డా. నరసింహ రెడ్డి దొంతిరెడ్డి (ఎల్ఎన్ రెడ్డి)ని వేడుకల ఛైర్మన్గా నియమించారు. ఆయన గతంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించారు.
ఈ మహోత్సవాల్లో TTA యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, రీజినల్ వైస్ ప్రెసిడెంట్లు సుమారు 200 మంది సభ్యులు పాల్గొని, భారతదేశంలో సేవా డేస్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, పదవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ వేడుకల్లో గత పదేళ్లుగా TTA అమెరికా మరియు భారతదేశంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తారు.