హైదరాబాద్ ద్విచక్ర వాహనదారులకు షాక్‌…

*హైదరాబాద్ ద్విచక్ర వాహనదారులకు షాక్‌*

సైబరాబాద్‌ పరిధిలో ద్విచక్ర వాహనదారులకు పోలీసులు షాక్‌ ఇచ్చారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతూ తొలిసారి దొరికితే.. మూడు నెలల పాటు లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు. రెండోసారి హెల్మెట్‌ లేకుండా దొరికితే శాశ్వతంగా లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే డ్రైవింగ్‌ చేస్తున్నవారితో పాటు వెనక కూర్చున్నవారికి కూడా హెల్మెట్‌ తప్పనిసరని చెప్పారు. 2019 ఎంవి (MV) యాక్ట్‌ను అమలు చేస్తున్నామని సైబరాబాద్‌ పోలీసులు చెప్పారు.