తెలంగాణ భవన్లో జరిగిన అంబర్పేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ .
గత ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు.
అడ్డమైన మాటలు, అడ్డమైన ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలో కరెంట్ లేక రైతులు గోస పడుతున్నారు. తాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది.
అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ నిండా ముంచింది.
గత ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అడ్డమైన మాటలు, అడ్డమైన ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన అంబర్పేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ లేక రైతులు గోస పడుతున్నారు. తాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు..
పరిపాలన చేతకాక ప్రజలకు ఏమీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎల్నినో ప్రభావంపై 10 నెలల ముందే ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పక్క రాష్ట్రాలు, దిగువ రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాజెక్టులను నింపుకున్నాయి. తెలివిలేని రేవంత్ రెడ్డి మాత్రం ప్రాజెక్టులను నింపలేదు.. కాళేశ్వరం పంపులు ప్రారంభిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని, తాను చేసిన అబద్ధాలు ప్రజల ముందు తేలిపోతాయని రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. మేడిగడ్డ కూలిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. కాంగ్రెస్ వాళ్లే మేడిగడ్డను కూల్చారు..రాహుల్ గాంధీని తీసుకొచ్చి మేడిగడ్డ కూలిపోయిందంటూ అబద్ధాలు చెప్పించారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరు. రేవంత్ రెడ్డి దున్నపోతు ఈనిందంటే.. కిషన్ రెడ్డి దూడను కట్టేయమంటాడు. కేసీఆర్పై విమర్శలు చేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటవుతాయి. పిచ్చోడి చేతిలో రాయిలా పాలన సాగుతోంది. మరో ఏడాది రేవంత్ రెడ్డి హడావుడి ఉంటుంది. ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణలో లూటీ పాలన నడుస్తోంది. తెలంగాణలో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం .. కాంగ్రెస్ చేతుల్లో మోసపోయిన అన్ని వర్గాలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నాయి.. తెలంగాణలోనే కాదు మళ్లీ దేశంలో కేసీఆర్ కీలకం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి… కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు దేశంలో కీలకం కాబోతున్నాయి.. నాలుగు సంవత్సరాల కింద కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీయేతర కూటమి అంటే చాలామందికి అర్థం కాలేదు. మోదీ ఏం చేస్తున్నాడో చూస్తానే ఉన్నాం.. ఈరోజు ఒకవైపు దేశాన్ని సంక్షోభంలోకి నెడుస్తున్నా.. బీజేపీకి ప్రత్యామ్నాయ ఎజెండా లేని కాంగ్రెస్ చూసిన తర్వాత కేసీఆర్ చెప్పింది వాస్తవం అని భావిస్తున్నారు .. రాహుల్ గాంధీ ఎంత చేసినా లాభం లేదు. రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టినా లేస్తలేడు .. దేశంలో కాంగ్రెస్ విఫలమైంది కాబట్టే బీజేపీ పార్టీపై సీజేపీ పేరుతో యువతీ యువకులు పోరాటం చేస్తున్నారు రాజకీయ నాయకులను బీజేపీ బెదిరించగలుగుతుంది కానీ యువతరాన్ని కాదని అర్థమైంది ..బీజేపీ గత పది సంవత్సరాలు ఎప్పుడూ లేనంత బలహీనంగా తయారైంది .. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణలో కలిసిపోయి పనిచేస్తున్నారు.. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్ లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు .. రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కి లేదు .. కార్పొరేషన్ ఎన్నికలు పడితే 2017లో సెంచరీ కొట్టిన తీరుగా బీఆర్ఎస్ కార్పొరేషన్లను గెలుచుకుంటుంది .. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల నమోదు నుంచి మొదలుకొని ఎన్నికల దాకా కలిసి పనిచేయాలి .. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ధన బలాన్ని మాత్రమే నమ్ముకున్నది .. విద్యార్థులను నిరుద్యోగులను యువతీ యువకులను యూత్ డిక్లరేషన్ పేరుతో దారుణంగా మోసం చేసింది.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి వారు బుద్ధి చెప్పడం ఖాయం..