మరో రికార్డ్‌ సాధించిన DRDO…ఒకే లాంఛర్‌ నుంచి 2 ప్రళయ్‌ క్షిపణుల ప్రయోగం…!

మరో రికార్డ్‌ సాధించిన DRDO.

ఒకే లాంఛర్‌ నుంచి 2 ప్రళయ్‌ క్షిపణుల ప్రయోగం.

దేశీయంగా సెమీ బాలిస్టిక్‌ క్షిపణి ప్రళయ్‌ తయారీ.

DRDO అధికారులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ప్రశంసలు

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి ఈ పరీక్షల్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు.ఈ క్షిపణుల్ని DRDO అభివృద్ధి చేసింది. డిసెంబర్ 31 న ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో ఈ పరీక్షలు నిర్వహించగా విజయవంతం అయినట్లు.. ఈ మిషన్ లక్ష్యాలను అందుకున్నట్లు DRDO అధికారులు వెల్లడించారు.

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO).. తాజాగా ప్రళయ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలామ్‌ ద్వీపంలోని ప్రయోగ కేంద్రంలో నిర్వహించగా, విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ రెండు క్షిపణులు పరీక్షల సమయంలో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో మోహరించిన ట్రాకింగ్ సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును ధృవీకరించామని అన్నారు…దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణులు 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవని తెలిపారు. ఈ మిసైల్స్ పేలోడ్ కెపాసిటీ 500 కిలోల నుంచి 1000 కిలోలు ఉంటుందని వివరించారు. మరోవైపు ప్రళయ్ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంతో DRDO శాస్త్రవేత్తలను రక్షణశాఖ మంత్రి రాజ్‍నాథ్ సింగ్ అభినందించారు.

ఇక ఈ ప్రళయ్ క్షిపణి.. అత్యాధునిక నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలతో పనిచేస్తుంది. వివిధ రకాల వార్‌ హెడ్‌ లను మోసుకెళ్తూ శత్రువుల స్థావరాలపై విరుచుకుపడగలిగే సత్తా ఈ ప్రళయ్ క్షిపణుల సొంతం. ఈ మేరకు హైదరాబాద్‌ లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)తో పాటుగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) వంటి సంస్థల సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు. ఇక త్వరలోనే ప్రళయ్ క్షిపణులు సైన్యంలో చేరనున్నాయి. ఈ మిసైల్స్ ను పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా ప్రయోగించనున్నారు.నియంత్రణ రేఖ, వాస్తవాదీన రేఖ వద్ద ప్రళయ్ మిస్సైల్‌ ను మోహరించే ఛాన్స్ ఉంది. దీంతో దాయాది దేశాలైన పాకిస్థాన్, చైనాలకు ఇదో షాక్ అని చెప్పొచ్చు..