గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలను జిల్లా గెజిట్లో ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమి షనరు హైకోర్టు ఆదేశించింది. చర్యల వివరాలను తదు పరి విచారణనాటికి న్యాయస్థానానికి చెప్పాలని స్పష్టం చేసింది.
▪️ఏపీ గ్రామపంచాయతీ (ఆస్తుల రక్షణ) నిబంధనలు-2011 ప్రకారం గ్రామపంచాయతీకి సంబంధిం చిన భూముల జాబితాను సిద్ధం చేసి గెజిట్లో ప్రచురిం చాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్, జిల్లాపంచాయతీ అధికారి, కలెక్టర్లపై ఉందని పేర్కొ న్నారు.
▪️గెజిట్ ప్రచురిస్తే ఆస్తుల రక్షణతోపాటు ఆక్రమ ణలపై చర్యలకు అవకాశముంటుందని తెలిపారు.