దేవరకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దారుణం..!

దేవరకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దారుణం

ఫేర్వెల్ పార్టీ లో సినిమా ఫైట్ లా కొట్టుకున్న పాఠశాల విద్యార్థులు

పోలీసుల రంగ ప్రవేశం

దేవరకొండ పట్టణంలోని (జడ్పిహెచ్ఎస్) జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఫేర్వెల్ పార్టీ సందర్బంగా 9వ మరియు 10 వ తరగతి విద్యార్థులు సినిమా ఫైట్ ను తలపించేలా పాఠశాల లోపల ఫైట్ జరిగింది. 10వ,తరగతి చదువుతున్న విద్యార్తులు కొట్టారు అంటూ తొమ్మిదవ తరగతి విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థి ఫోన్ చేయడంతో తల్లిదండ్రులు,బంధువులతో వచ్చిన విద్యార్థి బంధువులు సినిమా ఫైట్ తలించేలా పాఠశాలలోని విద్యార్థులను చితక భదారు. వెంటనే ప్రధాన ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బైటి నుంచి వచ్చి విద్యార్థులను కొట్టిన వ్యక్తులకు పోలీసులు పట్టుకోని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లడం జరిగింది. పెద్దల సమక్షంలో ఇరు వర్గాల వారిని సర్ది చెప్పడంతో పాటు మరోసారి ఇటువంటి గొడవలు జరగకుండా చూస్తామని విద్యార్థుల తల్లితండ్రులు పోలీసులకు హామీ ఇచ్చారు.