దుర్గ శ్రీ శక్తి గ్రూప్ ఆధ్వర్యంలో మద్దెలమ్మ తల్లికి ఒడి బియ్యం కార్యక్రమం

దేవరకొండ……

దేవరకొండ లో మద్దెలమ్మ తల్లి ఆలయంలో వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు పందిరి జ్యోతి దుర్గ శ్రీ శక్తి గ్రూప్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రతినెల అమ్మవార్లకు ఒడిబియ్యం పోసే కార్యక్రమంలో భాగంగా మద్దెలమ్మ తల్లికి మహిళలు అందరు కలిసి ఒడిబియ్యం సమర్పించినారు.
పందిరి జ్యోతి మాట్లాడుతూ అమ్మవార్లకు ఒడిబియ్యం పోసే కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు ఆ తల్లికి ఒడిబియ్యం పోసే అదృష్టం వచ్చినందుకు చాలా సంతోష పడుతున్నాం అని తెలియజేసినారు అందరూ బాగుండాలి దాంట్లో మేము మా గ్రూప్ సభ్యుల ఫ్యామిలీలు అందరూ బాగా ఉండాలి అని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.