జెన్ జీ తో పోటీ పడే ఆలోచన ముఖ్యమంత్రిదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు…మా NSUI, యూత్ కాంగ్రెస్ నేతల్లో 90 శాతం జెన్ జీలే ఉన్నారని చెప్పారు. ఇవాళ మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన ఆయన.. విద్యార్థుల నిరసన కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. నీట్ అనేది కోట్లాది విద్యార్థులు సమస్య అని, మధ్య తరగతి కుటుంబాలు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారని చెప్పారు. కాక్రోచ్ పార్టీ ఆన్లైన్ ఉద్యమం మొదలు పెట్టిందని ఆ పార్టీ నినాదాన్ని బలంగా తీసుకెళ్లింది రాహుల్ గాంధీ అని చెప్పారు. నిరసన ఉద్యమం విస్తరించడానికి కారణం కాంగ్రెస్ అని, రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడంతో ఉద్యమం పీక్స్ కి వెళ్ళిందన్నారు. మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్కు సన్మానం చేయడం బీజేపీ మనస్తత్వాన్ని తెలియచేసిందన్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై స్పందిస్తూ ఎవరు మంత్రులు కావాలో డిసైడ్ చేసేది ఏఐసీసీ అని స్పష్టం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.