ఎండల తీవ్రతతో రోజు పెరుగుతున్న వేడి..!

Weather Report:

ఎండలు బాబోయ్.. ఎండల తీవ్రతతో రోజు పెరుగుతున్న వేడి..
వాతావరణం దూసుకొస్తున్న వాయుగుండం!

ఎల్ నినో అనేది ప్రతి 3 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఒక రకమైన కాలానుగుణ మార్పు. ఎల్ నినో చోటుచేసుకుంటే.. జూన్- అక్టోబర్ నెలల మధ్య మన దేశంలో రుతుపవనాలు ప్రభావితమై వీక్ అవుతాయి. తద్వారా వర్షాలు లేట్ అవుతాయి. ఎల్ నినో ఎఫెక్ట్ తో మనకు చలికాలం కూడా వెచ్చగా అనిపిస్తుంది. వేసవి కాలం మరింత వేడిగా మారుతుంది… గత 20 ఏళ్లలో సంభవించిన కరువులన్నీ ఎల్‌నినో సంవత్సరాల్లోనే చోటుచేసుకున్నాయి. ఇది కూడా ఎల్ నినో ఏడాది కావడంతో ఈసారి కూడా దాని ఎఫెక్ట్‌తో వ్యవసాయోత్పత్తులు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. గత 65 ఏళ్లలో 14 సార్లు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడింది. అయితే 9 సార్లు భారతదేశంలో పెద్ద ఎత్తున కరువు వచ్చింది. 5 సార్లు మనదేశంలో కరువు వచ్చినా.. ఎల్ నినో ప్రభావం స్వల్పంగానే పడింది.

నిపుణుల అంచాన ప్రకారం తెలంగాణలో ఈ వేడి ప్రభావాన్ని కంట్రోల్ చేయాలంటే దాదాపు 5 కోట్ల మొక్కలు నాటాలని పర్యావరణ వేత్తలు అంచనా వేశారు. దీని బట్టి చూస్తే ఎంత మేర వాతావరణం మారింది అర్థం చేసుకోవచ్చు. మారుతున్న జీవన విధానానికి తోడు.. మనం యూజ్ చేస్తున్న వస్తువుల వల్ల వాతవరణం ద‌శాబ్ధ కాలంలో స‌గ‌టున భూతాపం 0.2 డిగ్రీల సెల్సియ‌స్‌తో వేడెక్కుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 50 మంది ప్రఖ్యాత సైంటిస్టులు ఈ హెచ్చరిక చేశారు. 2013 నుంచి 2022 వ‌ర‌కు మాన‌వుల వ‌ల్ల క‌లుగుతున్న ప‌ర్యావ‌ర‌ణ మార్పులతో ఉష్ణోగ్రత‌లు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.

ఏపీ, తెలంగాణలో ఈమధ్య మనం ఒక మాట బాగా వింటున్నాం.. “బాబోయ్ ఇవేం ఎండలు” అని చాలా మంది అల్లాడిపోతున్నారు. కానీ ఇంకా ఎల్ నినో ఇప్పటికీ వరకు కొంతే ప్రభావితం చూపిస్తుంది అది ఇంకా తీవ్రతరం దాలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు ప్రజలు… మన ఇండియాకి ఎల్ నినో తరహా వాతావరణం కొత్తేమీ కాదు. ఇదివరకు చాలాసార్లు వచ్చింది. కానీ.. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ప్రపంచమంతా భూతాపం ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి సమయంలో ఎల్ నినో రావడం ఏమాత్రం మంచిది కాదు. కానీ వచ్చేలా ఉంది. అదే ఇప్పుడు శాస్త్రవేత్త.

వాతావరణం దూసుకొస్తున్న వాయుగుండం!

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఈ రెండింటి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ఊపందుకోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్ష సూచనతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మన్యం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వానలు పడే సూచనలు ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర , రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.