దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేసి పోలీస్ లు రిమాండ్ కు తరలించిన, ఇంకా ఉద్యోగుల సంఘాల నిరసన పోరాటం ఎందుకు..!?
అధికారులపై దాడులను ఖండిస్తూ ఉద్యోగుల జేఏసీ పిలుపు..
ఉద్యోగుల సంఘాల రాజకీయ నాయకుల.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కమెంట్స్..!
రైతులని అరెస్టు చేసి పోలీస్ లు రిమాండ్ కు తరలించిన, ఇంకా ఉద్యోగుల తాపత్రియం ఏమిటి..!?
ఎవరు మెప్పుకోసం ఇదంతా..!
ఉద్యోగుల సంఘాల, రాజకీయ నాయకుల వ్యవహరిస్తున్నారా..!
విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల మీద జరిగిన దాడికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది. అధికారులపై జరిగిన దాడిని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులు, కార్మికులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల తరఫున ఖండిస్తున్నామని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్సరావు తెలిపారు. బుధవారం టీజీవో భవన్లో మీడియాతో వారు మాట్లాడారు. దాడులకు పాల్పడిన దోషులను శిక్షించాలని కోరుతూ గురువారం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద, హైదరాబాద్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకత్వంలో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. దాడులు మరోసారి పునరావృతమైతే 10 లక్షల మంది ఉద్యోగులకు నాయకత్వం వహించే 206 ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో ఉన్న జేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిస్తుందని హెచ్చరించారు.
ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగుల జేఏసీ, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్, ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్ రెడ్డి, గౌతమ్.. సంఘం నేతలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి, సీఎస్ శాంతికుమారికి సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇదే విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ధర్నాలు చేయాలని వి.లచ్చిరెడ్డి నేతృత్వంలోని ఉద్యోగుల జేఏసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అధికారులపై జరిగిన దాడిని ఖండించకపోగా కొందరు నాయకులు దాడికి పాల్పడిన వారిని పరామర్శించడం ప్రజాస్వామ్యానికే అవమానమని లచ్చిరెడ్డి పేర్కొన్నారు. కాగా, కలెక్టర్ ప్రతీక్ జైన్పై జరిగిన దాడిని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శశాంక్ గోయెల్, కార్యదర్శి జయేశ్ రంజన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి దాడులు.. అధికారుల విధులను ఏవిధంగానూ ఆటంక పర్చలేవని పేర్కొన్నారు. కాగా, పోలీస్ విధులపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్ని పోలీస్ అధికారుల సంఘం తప్పుబట్టింది. పదేళ్లు పరిపాలించిన వారికి పోలీస్ విధుల గురించి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపీరెడ్డి అన్నారు. పోలీస్ విధుల్లో జోక్యం చేసుకోవద్దని, పోలీస్ వ్యవస్థను తప్పుపట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు..
రైతులు అరెస్టు రిమాండ్ కు తరలింపు..
విచారణ పేరుతో పోలీసులు ఎప్పుడు వచ్చి ఎవరిని తీసుకెళ్తారోనన్న భయం వెంటాడుతోంది. పురుషులు ఇళ్లకు రాకుండా దూరప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నట్లు తెలిసింది. బుధవారం కూడా మూడు గ్రామాల్లో మహిళలు ఇళ్లలో ఉండకుండా ఉదయమే పొలాలకు వెళ్తున్నారు. సాయంత్రం వరకు పిల్లలతో పొలాల్లోనే గడిపి బిక్కుబిక్కుమంటూ రాత్రికి చేరుకుంటున్నారు. లగచర్లలో కొద్ది మంది మాత్రమే బయటకు వచ్చి అటూఇటూ తిరుగుతూ కనిపించారు కానీ రోటిబండతండా, పులిచర్లకుంటతండాలు బుధవారం కూడా నిర్మానుష్యంగానే కనిపించాయి..
మూడోరోజూ నిలిచిన అంతర్జాల సేవలు
సోమవారం రాత్రి 10 గంటలకు నిలిపివేసిన అంతర్జాల సేవలను ఇంకా పునరుద్ధరించలేదు. దీంతో మీసేవ కేంద్రాలు వెలవెలబోయాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అంతర్జాల సేవలు పొందడానికి కొందరు బొంరాస్పేట మండల కేంద్రానికి సమీపంలోని గడిసింగాపూర్కు వెళ్తున్నారు.
బొంరాస్పేట పీఎస్లోనే బలగాల మకాం
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసుల బలగాలు బొంరాస్పేట పోలీస్ స్టేషన్లోనే మకాం వేశాయి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పోలీసులు వెళ్లే విధంగా ఉన్నతాధికారులు బలగాలను ఇక్కడే ఉంచారు..
ఘటనపై అరెస్టులు జరుగుతున్న ఉద్యోగుల నిరసన ఎందుకు..!?
ఘటనపై అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి.. రాజకీయాలు మొదలవుతూనే ఉన్నాయి.. కానీ ఇంకా ఉద్యోగులు నిరసన తెలుపుతామంటూ ప్రకటనలు ఇవ్వడం పై పలు అనుమానాలు తావిస్తోంది.. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గానే ఉన్నట్లుగా సమాచారం.. ఎంత పెద్ద వారు ఉన్న అరెస్టు చేయడం ఖాయమనే సంకేతాలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి.. తరచూ ఉద్యోగ సంఘాలు ఘటన జరిగిన తర్వాత చాలా లేటుగా స్పందించి, ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలి కఠినంగా శిక్షించాలి… ఆది ఎవరైనా కోరుకునేదే ఎందుకంటే అధికారులపై దాడి సమన్యాసం కాదు… కానీ ఇదే విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మాత్రం నిత్యం దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రాలు అందించడం వెనక పలు అనుమానాలు తొలగిస్తుంది…
అంటే ప్రభుత్వం సరైన పద్ధతిలో విచారణ చేయడం లేదని ఉద్యోగస్తుల ఆవేదన..!? లేక ఉద్యోగ సంఘాలు రాజకీయాలుగా మారాయని సోషల్ మీడియాలో విమర్శలని నిజం చేస్తున్నారా…. దీని వెనక కారణాలేమిటో అర్థం కాక అయోమయంలో ఉన్నారు ప్రజలు… గతంలో కూడా ఉద్యోగులపై దాడి జరిగినప్పుడు ఈ తరహాలో ఎందుకు స్పందించలేదని పలువురు ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పుడే ఇంత సీరియస్గా ఎందుకు తీసుకున్నారు రానున్న రోజుల్లో కూడా ఇలానే వ్యవహరిస్తారా అని కూడా పలువురు అధికారులు తెలుపుతున్నారు..