ఉత్కంఠ భరిత టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారత్‌పై 22 పరుగుల తేడాతో సంచలన విజయం…!

ఉత్కంఠభరిత టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారత్‌పై 22 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఈ విజయంతో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది…

చివరి వరకు పోరాడిన టీమిండియా… 22 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ విజయంతో 2-1 తేడాతో ముందంజలోకి వెళ్ళింది ఇంగ్లాండ్. మరో రెండు టెస్టులు ఈ రెండు జట్ల మధ్య మిగిలి ఉన్నాయి.

అయితే టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ టెస్టులో… మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj ) అలాగే రవీంద్ర జడేజా చివరి వరకు బ్యాటింగ్ చేశారు. కానీ స్పిన్నర్ బషీర్ వేసిన అద్భుతమైన బంతికి అవుట్ అయ్యాడు సిరాజ్. దీంతో ఇంగ్లాండ్ గెలిచింది. అయితే.. వికెట్ కోల్పోయిన తర్వాత గ్రౌండులోనే సిరాజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. తనవల్లే టీమిండియా ఓడిపోయిందన్న బాధను… వెళ్లగక్కే ప్రయత్నం చేశాడు.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే ప్రత్యర్థి జట్టు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes), రూట్ ( Joe Root) ఇద్దరు మహమ్మద్ సిరాజ్ ను ఓదార్చారు. క్రికెట్ లో గెలుపు ఓటములు సహజమే అంటూ.. సిరాజ్ ను వెన్ను తట్టి.. ఓదార్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి…

బౌలర్ల ఎటాక్..

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా టీమిండియాను కట్టడి చేశారు. వారి నిరంతర ఒత్తిడి, వ్యూహాత్మక బౌలింగ్‌తో భారత బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ముఖ్యంగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు ఆండర్సన్, బ్రాడ్ కీలక వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. భారత బ్యాట్స్‌మెన్ ఈ ఒత్తిడిని తట్టుకోలేక కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయారు. జడేజా మాత్రం చివరి వరకు పట్టుదలతో ఆడాడు. అతని ఆట భారత జట్టుకు గెలుస్తామని అనిపించినప్పటికీ, ఇంగ్లండ్ బౌలర్ల దాడి ముందు ఆ ఆశలు ఆవిరయ్యాయి.

చివరి రోజున..

సోమవారం లార్డ్స్ టెస్ట్ చివరి రోజున ఆతిథ్య జట్టు భారత జట్టును 170 పరుగులకు ఆలౌట్ చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో భారతదేశంతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు, బెన్ స్టోక్స్ జట్టు లీడ్స్ టెస్ట్‌లో భారత్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అదే సమయంలో భారత జట్టు రెండో టెస్ట్ (ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్)ను 336 పరుగుల తేడాతో గెలుచుకుంది.

మొదట బ్యాటింగ్

లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లకు 387 పరుగులు చేసింది. వారి తరఫున జో రూట్ 104 పరుగులు, జేమీ స్మిత్, బ్రైడాన్ కార్స్ వరుసగా 51, 56 పరుగులు చేశారు. ఆ తర్వాత భారత్ కూడా 10 వికెట్లకు 387 పరుగులు చేసింది. వారి తరఫున కేఎల్ రాహుల్ 100, రిషబ్ పంత్ 74, రవీంద్ర జడేజా 72 పరుగులు చేశారు.

జడేజా నాటౌట్‎

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 10 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దానిని భారత జట్టు సాధించలేకపోయింది. చివరకు 170 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ తరఫున ప్రధానంగా జడేజా 61, కేఎ రాహుల్ 39, కరుణ్ నాయర్ 14, నితీష్ 13 పరుగులే అత్యధికం కావడం విశేషం. జడేజా 61 పరుగులతో నాటౌట్‎గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 181 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు.