ఈనెల 17న ప్రతి తండాలో ర్యాలీ నిర్వహించి.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.
-గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది..
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దే.
-గిరిజన తండాలకు స్వపరిపాలన కల్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే
-కాంగ్రెస్ హామీలకే పరిమితం కాకుండా గిరిజనుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.
– దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ……….
తెలంగాణలో గిరిజన తండాలు, గూడేలకు ప్రత్యేక గ్రామ పంచాయతీ హోదా కల్పించి, గిరిజనులకు స్వపరిపాలనను అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదే నని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన దేవరకొండ నియోజకవర్గ ST ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ …..గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని ఆయన అన్నారు.2018లో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4,383 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయగా, సుమారు 3,146 తండాలు, గూడేలు స్వతంత్ర గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయని తెలిపారు. 500కు పైగా జనాభా కలిగి, అప్పటికే ఉన్న గ్రామ పంచాయతీ కేంద్రానికి 1.5 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.తండా గ్రామ పంచాయతీగా మారడంతో గిరిజనులకు సొంత సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యాలయం, నిధులు, స్థానిక అభివృద్ధిపై నిర్ణయాధికారం లభించిందన్నారు. 3,146 మంది సర్పంచులు, 24,682 మంది వార్డు సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఏర్పడి గ్రామస్థాయి పరిపాలనలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించారని ఆయన తెలిపారు.ప్రత్యేక గ్రామ పంచాయతీల ద్వారా అంతర్గత రహదారులు, వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం తదితర మౌలిక వసతులపై స్థానికంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. తండాలు పెద్ద గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న సమయంలో ఎదురైన పరిపాలనా నిర్లక్ష్యానికి ఇది శాశ్వత పరిష్కారం చూపిన సంస్కరణ అని రవీంద్ర కుమార్ అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకంగా ST Special Development Fundకు చట్టబద్ధత కల్పించిందని తెలిపారు..
2022–23లో రూ.13,412.63 కోట్లు, 2023–24లో రూ.15,232.62 కోట్లకు నిధులను పెంచినట్లు పేర్కొన్నారు.గిరిజన రైతులకు సాగుభూముల అభివృద్ధి కోసం గిరి వికాసం పథకం ద్వారా వేలాది మంది రైతులకు ప్రయోజనం కల్పించారని తెలిపారు.గిరిజన విద్యార్థుల కోసం నూతన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, IIT–NEET కోచింగ్, STARS వంటి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, గిరిజన యువతకు ఉపాధి అవకాశాల కోసం CM ST Entrepreneurship & Innovation Scheme, Driver Empowerment Scheme వంటి కార్యక్రమాలను అమలు చేసినట్లు రవీంద్ర కుమార్ వివరించారు.2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గిరిజనుల కోసం అనేక హామీలు ఇచ్చిందని, వాటి అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీకి ఏటా రూ.25 లక్షలు కేటాయిస్తామని, కొత్త గిరిజన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల చొప్పున నిధులు ఇస్తామని, కొత్త ITDAలు ఏర్పాటు చేస్తామని, గిరిజన విద్యార్థులకు విద్యా జ్యోతులు అందిస్తామని, ప్రతి మండలంలో SC/ST రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చిందన్నారు.హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా గిరిజనులను మోసం చేయడం సరికాదని ఆయన అన్నారు.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం కేవలం పరిపాలనా మార్పు కాదని, గిరిజనులకు ఆత్మగౌరవం, స్వపరిపాలన, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించిన చారిత్రాత్మక నిర్ణయమని రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల తరఫున పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రామావత్ దాస్రూ నాయక్,TVN రెడ్డి,వెల్లుగురి వల్లపు రెడ్డి, జార్పుల లోక్య నాయక్, కౌన్సిలర్ కేతవత్ రుప్లా నాయక్,రమావత్ రమేష్, రామావత్ మోహన్ కృష్ణ, ఇస్లావాత్ అభిషేక్, కేతవత్ శంకర్ నాయక్, కేతవత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.