ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – ఆవిఘ్నమస్తు,
తేదీ … 16 – 09 – 2026,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
భాద్రపద మాసం,
శుక్ల పక్షం,
తిథి : *పంచమి* ఉ8.43 వరకు,
నక్షత్రం : *విశాఖ* సా6.19 వరకు,
యోగం : *వైధృతి* మ2.26 వరకు,
కరణం : *బాలువ* ఉ8.43 వరకు,
తదుపరి *కౌలువ* రా9.27 వకు,
వర్జ్యం : *రా10.40 – 12.25*
దుర్ముహూర్తము : *ఉ11.31 – 12.20*
అమృతకాలం : *ఉ8.52 – 10.35*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండo : *ఉ7.30 – 9.00*
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 5.51,
సూర్యాస్తమయం : 6.01,
*_నేటి మాట_*
*మానవునికి సుఖం ఎలా ప్రార్థిస్తుంది??*
_*మోహం హిత్వా ప్రియో భవతి*_
_*క్రోధం హిత్వా న సోచసి*_
_*కామం హిత్వార్థవాన్ భవతి*_
_*లోభం హిత్వా సుఖీ భవతి*_
_*మోహం హిత్వా ప్రియో భవతి*_
గర్వం ఉండినంతవరకు మానవుని ఎవ్వరును ప్రేమించలేరు.
ఏ నాడు మానవుడు గర్వమును అణగద్రొక్కునో, అప్పుడే అట్టి మానవుని సర్వులూ ప్రేమిస్తుంటారు.
*క్రోధం హిత్వా నసోచసి :*
క్రోధం ఉండినటువంటి వానికి సుఖమనేటువంటిది ఉండదు.
వాడు నిరంతరము కూడను శోకించుచుండును.
ఎప్పుడు ఈ క్రోధమును అణగద్రొక్కునో, అప్పుడే అతనికి ఒక విధమైన ఆనందము ప్రాప్తిస్తుంది.
*కామం హిత్వార్థవాన్ భవతి:*
మితి మీరిన కోరికలు ఉండినంతవరకును ఇతనికి ఎట్టి సంపద కూడను చేకూరదు.
ఎప్పుడు ఈ మానవుడు తన కోరికలను అదుపులో ఉంచుకొనునో, అప్పుడే సర్వులూ అతనిని ప్రేమిస్తారు.
*లోభం హిత్వార్ధ సుఖీ భవతి :* లోభముండినంతవరకును, ఇట్టి మానవునికి ఎట్టి సుఖము కూడనూ ప్రాప్తించదు.
ఏ నాడు లోభమును దూరమున గావించుకొనునో, ఆనాడే ఈ మానవునకు “సుఖమనేటువంటిది ప్రాప్తిస్తుంది.”
*_🌺శుభమస్తు🌺_*
సమస్త లోకా సుఖినోభవంతు