మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలోని ఓ బంగారం దుకాణంలో దుండగుడు నకిలీ తుపాకీతో యజమానిని బెదిరించి దొంగతనానికి యత్నించాడు..
షాపులోకి ప్రవేశించిన దుండగుడు తుపాకీ చూపించి భయపెట్టేందుకు ప్రయత్నించగా, యజమాని వెంటనే అప్రమత్తమై ధైర్యంగా స్పందించి దుండగుడి నుంచి తప్పించుకున్నాడు.
ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం జరగకపోగా, దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959.