ట్విట్టర్ (X)కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

గ్రోక్ (Grok) చాట్‌బాట్ ద్వారా సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కంటెంట్ ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ (X) యాజమాన్యానికి కఠిన ఆదేశాలు జారీ చేసింది.
గ్రోక్ చాట్‌బాట్ సృష్టిస్తున్న అసభ్య కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని, అలాగే ఈ అంశంపై తీసుకున్న చర్యల వివరాలతో 72 గంటల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) సమర్పించాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఐటీ చట్టాలు, సోషల్ మీడియా మార్గదర్శకాలను ఉల్లంఘించే విధంగా కంటెంట్ ఉంటే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినట్లు సమాచారం.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959