చేపలు తినేటప్పుడు, చాలామంది నడుము ముక్కలకు లేదా చేప ఫ్రై, ఇగురు వంటి రుచికరమైన వంటకాలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే వైద్య నిపుణులు ప్రకారం చేప పులుసు వంటి వంటకాలు మంచివని, రోస్ట్, ఫ్రై వంటి వేపుడు కూరల వల్ల చేపలోని పోషకాలు నశించిపోతాయని అంటున్నారు. రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, చేప తలకాయలో దాగి ఉన్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవడం అవసరం. చేప తలను ఎలా తినాలో నేర్చుకుంటే, జీవితంలో ఎప్పటికీ వదలరని కొందరు చెబుతుంటారు…పోషకాల గని చేప తలకాయ: చేప తలకాయలో మాంసకృత్తులతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ బీ2, విటమిన్ డి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలు పిల్లల నుంచి వృద్ధుల వరకు, గర్భిణీ స్త్రీలు, బాలింతలతో సహా అందరికీ మంచివని వైద్యులు చెబుతున్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959