గణపతి విగ్రహంతో పాటు రూ.5 లక్షల విలువైన బంగారం నిమజ్జనం..!

వినాయక చవితి వేడుకలు దేశమంతటా సందడిగా జరిగాయి. చాలామంది తమ ఇళ్లలో గణపయ్యను ప్రతిష్ఠించుకుని, అలంకారాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, నిమజ్జనం సమయంలో జరిగిన ఒక సంఘటన హైదరాబాద్‌లోని ఓ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది…
5 తులాల బంగారు గొలుసు.. గణపయ్య మెడలో మరిచిపోయారు

హైదరాబాద్, వనస్థలిపురంలోని హస్తినాపురం హోమ్ ప్రసాద్ అపార్ట్‌మెంట్‌లో నివసించే గిరిజ అనే మహిళ తన ఇంట్లో గణపతిని ప్రతిష్టించి, ప్రత్యేకంగా అలంకరించింది. స్వామివారికి తన కుటుంబానికి చెందిన 5 తులాల బంగారు గొలుసును వేసి మూడు రోజుల పాటు పూజలు చేసింది. భక్తి పారవశ్యంలో ఉన్న ఆ కుటుంబం, నిమజ్జనం కోసం విగ్రహాన్ని తుర్కయాంజాల్ మాసబ్ చెరువుకు తీసుకెళ్లింది.

కంగారులో బంగారం గొలుసును తీయడం మర్చిపోయిన ఆ కుటుంబం, నిమజ్జనం పూర్తి చేశాక విషయం గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. గుండెలు ఆగినంత పనై, బోరున ఏడుస్తూ తుర్కయాంజాల్ మున్సిపాలిటీ సిబ్బందిని ఆశ్రయించారు.

గణపయ్య దయ.. బంగారు గొలుసు తిరిగి లభ్యం

ఆ కుటుంబం బాధను చూసిన మున్సిపాలిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. జేసీబీలతో ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో నిమజ్జనమైన వినాయక విగ్రహాలను పక్కకు జరిపి, గంటల తరబడి శ్రమించి చివరికి ఆ కుటుంబం విగ్రహాన్ని బయటకు తీశారు. ఆశ్చర్యకరంగా, విగ్రహం మెడలో ఉన్న బంగారం గొలుసు సురక్షితంగా ఉంది. సిబ్బంది దాన్ని ఆ కుటుంబానికి తిరిగి అప్పగించగా, ఆనందంతో వారికి కన్నీళ్లు ఆగలేదు..
నిమజ్జనం చేశారు. దీంతో తలలు పట్టుకున్నారు. ఏం చేయాలో అర్థంకాక ఈ విషయాన్ని వారు మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. వెంటనే అధికారులు స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. చెరువులో అనేక విగ్రహాలు ఉన్నా, ప్రత్యేక యంత్రాల సాయంతో వెతుకులాట ప్రారంభించారు. కొన్ని గంటల ప్రయత్నాల తర్వాత చివరికి ఆ విగ్రహాన్ని గుర్తించి జాగ్రత్తగా బయటకు తీశారు. పరిశీలించగా బంగారు ఆభరణం సురక్షితంగా ఉన్నాయి. మున్సిపల్ అధికారులు వాటిని గిరిజ కుటుంబానికి తిరిగి అందజేశారు. తమ సంపద తిరిగి అందడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది..

పోయింది అనుకున్న బంగారం తిరిగి దొరకడంతో ఆ కుటుంబం ఆనందంతో పొంగిపోయింది. “ఆ వినాయకుడే మళ్లీ మాకు దాన్ని ఇప్పించాడు. ఇది ఆయన లీల” అంటూ మున్సిపాలిటీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, నిమజ్జనం చేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిమజ్జనానికి వచ్చే అందరికీ తెలియచేశారు. ..