వినాయక నిమజ్జనంలో అపశృతి ఆరుగురు మృతి..

Ganesh Immersion వినాయక నిమజ్జనంలో అపశృతి”
ఆరుగురు మృతి.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులోని శిరీష అనాథాశ్రమం విద్యార్థులు 6 మంది దుర్మరణం

వినాయక నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడిన ఆరుగురు విద్యార్థులు

సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు..

వినాయక చవిత సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మండలం పెద్దకంజర్లలో మూడు రోజుల పాటు గణేష్ పూజలు వైభవంగా నిర్వహించారు. నిమజ్జనం కోసమే నేరెడు చెరువుకు వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లారు. అయితే ఈ క్రమంలో పిల్లలు చెరువులో గల్లంతయ్యారు. ఒకరిని మరొకరు కాపాడే ప్రయత్నంలో ఆరుగురు పిల్లలు నీటిలో మునిగిపోయారు. స్థానికులు రక్షించేలోపే నీటిలో మునిగిపోయి మృత్యువాత పడ్డారు. విద్యార్థులు 8,9,10వ తరగతి చదువుతున్నట్లు గుర్తించారు. నేరెడుచెరులో పెద్దపెద్దగుంతలు ఉండటం వల్ల పిల్లలు నీటిలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాని పరిశీలించారు. విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.