నిబంధనలకు కి వ్యతిరేకంగా ఉండి, ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న రైస్ మిల్లును వెంటనే లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి..
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రం అంబేద్కర్ నగర్లో గల సునంద రైస్ ఇండస్ట్రీ
ట్రేడ్ లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అని గరిడేపల్లి మండల ఎంఆర్పిఎస్ మరియు జై భీమ్ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ ప్రజల తరఫున కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
వారు మాట్లాడుతూ అంబేద్కర్ జనావాస మధ్యలో ఉన్న సునంద రైస్ ఇండస్ట్రీస్ భారీ రైస్ మిల్లు వలన ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆరంజ్ జోన్లో ఉండే రైస్ మిల్ ప్రజావాసమధ్యలో ఉండకూడదని, నియమ నిబంధనలు ఎలాంటివి పాటించకుండా మిల్లు నిర్మాణం జరగడం వలన రాజ్యాంగ కల్పించిన ఆర్టికల్ 21 విగాంతం కలుగుతుందని, ఇట్టి మిల్లు వలన ట్రాఫిక్ జాము అనేక ఆక్సిడెంట్ కూడా జరిగాయని, మిల్లు వలన చదువుకునే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బంది అవుతుందని కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజా నివాసంలో, గుడికి, బడికి దగ్గరలో ఉన్న మిల్లుకు సంబంధించిన లైసెన్స్ రద్దు చేసి, ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని ప్రజల కోరుకుంటున్నారు. ఈ విషయమే స్పందించిన కలెక్టర్ గారు తక్షణమే ఇంటి సమస్యపై ఎంక్వయిరీ చేయించి సమస్య పరిష్కారాలు చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది.
ఇట్టి కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ యూత్ సభ్యులు నకిరేకంటి రవి, పిట్ట వెంకటేష్, ఆలంపల్లి శేఖర్, పిట్ట నాగరాజ్, మచ్చ వేణు, కుర్రి వెంకన్న మొదలైన వారు పాల్గొన్నారు..
