సర్పంచ్ రామాంజి గౌడ్ కు ఘన సన్మానం..!

సూర్యాపేట జిల్లా..

సర్పంచ్ రామాంజి గౌడ్ ను సన్మానిస్తున్న మాజీ ఎంపీటీసీ చాంద్ మియా మరియు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు.

గరిడేపల్లి .

మండలంలోని రాయిని గూడెం గ్రామపంచాయతీ నూతన సర్పంచి గుండు రామాంజి గౌడ్ ను కితవారిగూడెం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ చాంద్ మియా, ఉప సర్పంచ్ చిత్తలూరి వీరస్వామి, వార్డ్ మెంబర్లు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రామంజి గౌడ్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కీతవారిగూడెం గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు ముత్తినేని హరిబాబు, షేక్ సఫియా మీరా, బండారు అంజయ్య, బండారు సైదులు, గూడెపు వెంకటేశ్వర్లు, గుండు పూలమ్మ సైదులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు…

గమనిక..
ఈ ప్రాంతంలో ఏదైనా A TO Z వార్తలు
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959