గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గరిడేపల్లి మండల కేంద్రంలో యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వారి సహకారంతో, గరిడేపల్లి గ్రామ పెద్దలు,యూత్ సహకారంతో ప్రతి సంవత్సరం జనవరి 26న తల సేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం ఈ మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని యూత్ సభ్యులు తెలపడం జరిగింది. అన్ని దానాల కన్నా రక్తదానం చాలా విలువైనది అని, రక్తదానం అనేది ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుందని, కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ఎప్పుడూ ముందుండాలని కోరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధుల పాల్గొన్న గరిడేపల్లి గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య, గరిడేపల్లి మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ పైడిమర్రి రంగనాథ్, గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ట సైదులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెండెం ధనయ్య గౌడ్, పరెడ్డిగూడెం గ్రామ సర్పంచి కేతపల్లి నరసయ్య, మరియు అనేకమంది రక్తదాతలు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో 80 బ్లడ్ బ్యాగ్స్ సేకరించడం జరిగిందని,యూత్ సభ్యులు నకిరేకంటి సతీష్, చామకూరి హరీష్, కొత్తపల్లి రవి, ఆలంపల్లి శేఖర్, నకిరేకటి రవి, మాచర్ల రవి,మచ్చ వేణు, యువకులు,పెద్దలు, రక్తదాతలు మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.