సూర్యాపేట జిల్లా.. గరిడేపల్లి.
*కర్ల రాజేష్ లాకప్ డెత్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వీడాలి*
*ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల డిమాండ్*
*ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరం*
గరిడేపల్లి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కొత్తపల్లి రవి మాదిగ మీడియాతో ఈరోజు మాట్లాడటం జరిగింది. వారు మాట్లాడుతూ కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ చిలుకూరు మండల పోలీస్స్టేషన్లో చిత్ర హింసలకు గురై కస్టోడియల్ డెత్ కి గురి కావడం జరిగింది.
ఇట్టి కేసులో A1 గా ఉన్న చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి ని మాత్రం కాపాడుకొని ఎస్పీ ఆఫీసు అటాచ్ చేసి, కోదాడ సిఐ ప్రతాప లింగమును బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది,నవంబర్ 16 న మరణించిన కర్ల రాజేష్ నేటికీ రెండు నెలలు గడిచినా కూడా ఇంతవరకు ఎస్ఐని సస్పెండ్ చేయకపోవడం, వీరికి సూర్యాపేట జిల్లా డిఎస్పి,ఎస్పి సపోర్ట్ అందిస్తున్నారు, వీరందరికీ కూడా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, అలాగే సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అండదండలతోనే నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తక్షణమే మౌనం వీడకపోతే, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఎమ్మార్పీఎస్ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తు, హెచ్చరిస్తున్నాం.
పోలీసు వారు కూడా ఒకరిని కాపాడుకోవడం కోసం ఇంకొకరు, తప్పులు మీద తప్పులు చేస్తూ, పోలీసు వ్యవస్థ మీద గౌరవాన్ని పోగొట్టుకునే విధంగా తయారవుతున్నారు, కావున పోలీసు వారు కూడా ఇట్టి విషయంలో నిజాయితీగా పనిచేసి వ్యవస్థ పై,చట్టాలపై గౌరవం పెరిగే విధంగా ఉండాలని, కర్ల రాజేష్ కస్టోడియల్ డెత్ కారకులైన వారి అందరిపై మర్డర్ కేసు, అట్రాసిటీ కేసు, నమోదు చేసి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇట్టి కార్యక్రమంలో గరిడేపల్లి మండలం ఎంఆర్పిఎస్ ప్రచార కార్యదర్శి కడప వీరస్వామి, ఉపాధ్యక్షులు దూరే వినోద్, నకిరేకంటి రవి, పిట్ట వెంకటేష్, ఆలంపల్లి శేఖర్,మచ్చ వేణు, మచ్చ ఆదాం, పిట్ట రేవంత్, మచ్చ గంగరాజు, కొత్తపల్లి పవన్, బచ్చలకూరి నాగార్జున, పిట్ట నాగరాజ్ మొదలైన వారు పాల్గొన్నారు.