మూసీ నది పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికలో కీలకమైన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ అనుమతులు లభించాయి. హైదరాబాద్‌లోని బాపు ఘాట్ bappu ghat వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ పనులకు కేంద్ర రక్షణ శాఖ, భారత సైన్యం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ అమలుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి revanth Reddy కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ Rajnath Singh, కేంద్ర రక్షణ శాఖకు, భారత ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు.
మూసీ నది musi river పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి విజన్‌లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం CM పేర్కొన్నారు. మూసీ musi పరివాహక ప్రాంతాన్ని పర్యావరణ, సాంస్కృతిక, ప్రజా అవసరాలకు ఉపయోగపడే విలువైన ఆస్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తయితే మూసీ నది పరిసర ప్రాంతాల అభివృద్ధికి, పర్యాటక ప్రోత్సాహానికి, నగర సౌందర్యవృద్ధికి తోడ్పడటంతో పాటు ప్రజలకు మరిన్ని వినోద, విశ్రాంతి వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.