జీహెచ్ఎంసీ ఎన్నికలు తాత్కాలికంగా నిలిపివేయండి..తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు..

జీహెచ్ఎంసీ ఎన్నికలు తాత్కాలికంగా నిలిపివేయండి..

తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు..

వార్డుల సరిహద్దులను తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరిన పిటిషనర్లు..

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) చట్టవిరుద్ధంగా జరిగిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు..

1996 జీవో నంబర్ 570లోని రూల్ నంబర్ 5 ప్రకారం డీలిమిటేషన్ జనాభా లెక్కల ఆధారంగా చేయాలని, ఆ నిబంధనను ఉల్లంఘించారని పిటిషన్..

అదేవిధంగా 2019లో వచ్చిన తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్‌లోని సెక్షన్ 6ను కూడా ఉల్లంఘించారని కోర్టుకు తెలిపిన పిటిషనర్లు..

ప్రభుత్వం, పిటిషనర్ల తరపు వాదనలు విని విచారణను వాయిదా వేసిన హైకోర్టు.