నేపాల్‌లో విధ్వంసానికి కారణమైన GLOF..!

నేపాల్‌లో విధ్వంసానికి కారణమైన GLOF!

చైనా హెలికాప్టర్ గ్లేసియర్ విరిగిన ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి భారీగా నీరు విడుదల కావడంతో నేపాల్‌లో ఆకస్మిక వరదలు, తీవ్ర విధ్వంసం చోటుచేసుకున్నాయి.
https://www.facebook.com/share/r/1GzjWR8SAF/
GLOF (Glacial Lake Outburst Flood) అంటే హిమానీనదం అడ్డుకున్న సరస్సు కట్ట తెగిపోవడం.

నీటితో పాటు మంచు, రాళ్లు, బురద భారీ వేగంతో దిగువ ప్రాంతాలకు దూసుకురావడంతో ఆకస్మిక వరదలు సంభవిస్తాయి.

ప్రకృతి ప్రకోపం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించగలదో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
https://www.facebook.com/share/r/1F2ruquRCC/
#నేపాల్‌లో తాజా విలయం
ఆగస్టు 26, 2026న నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో భారీ వరదలు, మట్టి ప్రవాహాలు విధ్వంసం సృష్టించాయి. గ్లేషియర్‌లోని మంచు, రాళ్లు ఒక్కసారిగా కూలిపోయి భారీ నీటి ప్రవాహం ఏర్పడిందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. భోటే కోసి నది లోయలోకి దూసుకొచ్చిన వరదలు గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్‌ ప్రాజెక్టులను ధ్వంసం చేశాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో విదేశీయులు, పర్యాటకులు, యాత్రికులు కూడా ఉన్నారు.

ఈ ఘటనకు భూకంపమే కారణమన్న తొలినాటి అనుమానాలను తర్వాతి పరిశీలనలు బలపరచలేదు. గ్లేషియర్‌ కూలిపోవడం, మంచు-రాళ్ల ప్రవాహం, నదిలో ఒక్కసారిగా భారీ నీటి ఉద్ధృతి కలిసి ఈ విపత్తుకు కారణమైందని నిపుణుల అంచనాలు సూచిస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు సహాయక చర్యలకు కూడా పెద్ద అవరోధంగా మారాయి.

72 గంటల్లో నేపాల్ లో బీభత్సంగా వరదలు .

కనీ విని ఎరుగని విలయంతో విలువలలాడిపోయిన నేపాల్ కు మరో తీవ్రమైన హెచ్చరిక చైనా జారీ చేసింది. 72 గంటల్లో నేపాల్ లో బీభత్సంగా వరదలు రానున్నాయని హెచ్చరించింది. చైనా భూభాగంలోని కొచ్చేన్ కోలా పూరేపు సాంగో అని సరస్సు భారీ వరదలతో పొంగిపొర్లుతోందని, రెండు మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఇప్పటికే చేరిపోయిందని మరో మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు చేరితే భయంకరమైన వరదలు నేపాల్ కు తప్పదని హెచ్చరించింది . అందువల్ల ముందుగానే నేపాల్ దీన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసుకోవాలని, ఈ వరదలు కూడా ఇప్పటికే దెబ్బతిన్న ప్రాంతాల నుంచి పోయే అవకాశం ఉందని, అందువలన ప్రజలను కూడా అప్రమత్తం చేసి నష్టం జరగకుండా చూసుకోవాలని సలహా ఇచ్చింది…