పాలంచౌక్ భగవతి విగ్రహానికి చెమటలు?.. ఆ తర్వాత నేపాల్‌లో భారీ వరదలు..!

పాలంచౌక్ భగవతి విగ్రహానికి చెమటలు?.. ఆ తర్వాత నేపాల్‌లో భారీ వరదలు..!

నేపాల్‌ ప్రస్తుతం వినాశకరమైన వరదలను ఎదుర్కొంటున్న వేళ, పాలంచౌక్ భగవతి ఆలయంలో అమ్మవారి విగ్రహానికి చెమటలు పడుతున్నాయనే వార్తలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

అమ్మవారి విగ్రహంపై చెమట బిందువులు కనిపిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. ఈ అరుదైన ఘటనను పలువురు దైవ సంకేతంగా భావిస్తున్నారు. నేపాల్‌లో వరదల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే, విగ్రహంపై తేమ లేదా చెమటలాంటి బిందువులు ఏర్పడటానికి వాతావరణంలో తేమ, ఉష్ణోగ్రత మార్పులు వంటి సహజ కారణాలు కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇది నిజంగా యాదృచ్ఛికమా? ప్రకృతి ప్రభావమా? లేక భక్తులు భావిస్తున్నట్లుగా దైవ సందేశమా? ఈ ఘటనపై పలు రకాల చర్చలు సామాజిక మాద్యములను నడుస్తుంది..

గతంలో..

నేపాల్ పాలంచోక్ భగవతి అమ్మవారు రెండు రోజుల క్రితమే నేపాల్‌ను హెచ్చరించారు.
రెండు రోజుల క్రితం, పాలంచోక్ భగవతి విగ్రహానికి చెమటలు పట్టడం మొదలైందనే వార్త వచ్చింది, దీనిని సాంప్రదాయకంగా ఒక దుశ్శకునంగా భావిస్తారు.

ఆ తర్వాత నిన్న ఉదయం, వినాశకరమైన రసువా వరద సంభవించింది. పాలంచోక్ భగవతి అమ్మవారు సంకేతం ఇవ్వడం ఇది మూడవసారి.
1987, 1974లో కూడా ఈమె సంకేతం ఇవ్వగా, మరుసటి రోజే నేపాల్‌లో పెద్ద భూకంపం సంభవించింది.

వేల ఏళ్లుగా వస్తున్న నమ్మకం..విగ్రహానికి ఎందుకు చెమటలు పడతాయి అనే దానికి శాస్త్రీయ వివరణ కూడా ఉండవచ్చు…

కానీ నమ్మకం నిజమైనప్పుడు మనం మానవాతీత శక్తిని నమ్మక తప్పదు..