గోల్డ్- ఆల్ టైమ్ హైలెవల్‌కు ధర..!

బంగారం రేటు ‘తగ్గేదేలే’ అంటూ దూసుకుపోతోంది. మంగళవారం రోజు ఆల్ టైం హై లెవల్‌కు గోల్డ్ ధర పెరిగింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.520 మేర పెరిగి రూ.1,12,750కి చేరింది. ప్రపంచదేశాల్లో బంగారానికి పెరుగుతున్న డిమాండ్ వల్లే రేటు ఈ విధంగా పైపైకి పోతోంది. ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఆ దేశానికి చెందిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనాలు సైతం గోల్డ్ రేటు పెరుగుదలకు ఊతమిచ్చాయి..