బంగారం ధరలు gold price ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,300 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,450 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 2,22,000 పలుకుతోంది. బంగారం ధర గడచిన వారం రోజులుగా భారీగా తగ్గుతున్నట్లు చూడవచ్చు. ఈ ఏడాది జనవరిలో బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయిని నమోదు చేసింది 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర జనవరి 23వ తేదీన 1.83 లక్షల రూపాయలు నమోదు చేసింది. అక్కడి నుంచి చూసినట్లయితే బంగారం ధర సుమారు 30% వరకు పడిపోయినట్లు గమనించవచ్చు అదే సమయంలో వెండి ధర కూడా దాదాపు 50 శాతం వరకు పడ్డట్టు గమనించవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర దాదాపు 7 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనవరిలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయి ఒక ఔన్స్ 5600 డాలర్లు పలకగా, అక్కడ నుంచి బంగారం ధర ప్రస్తుతం 4000 డాలర్ల దిగువకు పడిపోయింది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.