అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
పట్టపగ్గాలు లేకుండా ఇన్నాళ్లు పరుగులు పెట్టిన బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో శనివారం 24 క్యారెట్ల బంగారం మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.8,620 తగ్గి రూ.1,60,580 వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.7,900 మేర పతనమై రూ.1,47,200 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర.3,50,000లుగా ఉంది. ఈ ధరల తగ్గుదల సామాన్యులకు, పెళ్లిళ్ల సీజన్ కోసం నగలు కొనే వారికి కలిసిరానుంది..
_• ఒక్కరోజులోనే కిలో వెండి రూ.1 లక్షకు పైగా.. 10 గ్రాముల బంగారం దాదాపు రూ.20 వేలు డౌన్..
*అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.
ఒక్కరోజే రూ.19,750 తగ్గిన 10 గ్రాముల బంగారం ధర.
ప్రస్తుతం 10 గ్రాముల బంగారం(24 క్యారెట్లు) ధర రూ.1,49,653..
భారీగా రూ.1,07,971 పడిపోయిన కిలో వెండి.
_• ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,91,922._
ప్రపంచ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం మరియు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులు బంగారంపై కాకుండా ఇతర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయికి చేరిన ధరల నేపథ్యంలో, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాలను స్వీకరించడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలపై తీసుకునే నిర్ణయాలు కూడా స్థానిక ధరలపై ప్రభావం చూపుతున్నాయి…