తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా యాక్షన్,కామెడీ థ్రిల్లర్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది.
Good Bad Ugly
కథ, నటన, దర్శకత్వం పరంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపై ప్రేక్షకులను ఆకట్టేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్లో ఈ సినిమా మే 8 నుండి స్ట్రీమింగ్కు రానుంది.
ఈ సినిమాలో అజిత్ సరసన ప్రముఖ నటి త్రిష నటించగా, చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.
కథలో అజిత్ డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించగా, యాక్షన్తో పాటు హాస్యాన్ని సమపాళ్లలో సమర్పిస్తూ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.రిలీజ్ అయిన కేవలం 10 రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్క్ ను అందుకుంది గుడ్ బ్యాడ్ అగ్లీ. విశ్వాసం సినిమా తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ రెండవ సారి రూ. 200 కోట్ల మార్క్ ను అందుకున్నాడు. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 8 నుండి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు తీసుకురానుండీ. మరోవైపు ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో సూపర్ హిట్ కలెక్షన్స్ రాబడుతోంది. నిన్న అజిత్ కుమార్ పుట్టిన రోజును పురస్కరించుకుని తమిళనాడు వ్యాప్తంగా హౌస్ ఫుల్ షోస్ తో నడించింది గుడ్ బ్యాడ్ అగ్లీ.