ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ ఆశలు అధికారికంగా ముగిశాయి.
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తో తలపడ్డ రాజస్థాన్ జట్టు 100 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ముంబయి ఇన్నింగ్స్‌లో నిర్దేశించిన భారీ లక్ష్యమైన 218 పరుగుల చేధనకు రాజస్థాన్ జట్టు బరిలోకి దిగింది.
అయితే వారి ఇన్నింగ్స్ 16.1 ఓవర్లలోనే 117 పరుగుల వద్ద కుప్పకూలింది.
జోఫ్రా ఆర్చర్ 30 పరుగులతో కొంత ప్రయాస పట్టినప్పటికీ, మిగిలిన బ్యాట్స్‌మెన్ మెరుగైన ప్రదర్శన చూపలేకపోయారు.
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లంతా సత్తా చాటడంతో రాజస్థాన్ రాయల్స్ 117 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
ముంబై ఇండియన్స్ ఇచ్చిన 218 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ఇదే గ్రౌండ్లో గుజరాత్‌పై 210 టార్గెట్‌ను 16 ఓవర్లలో ఊదేసిన రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో వికెట్లు కాపాడుకోవడంలో విఫలమైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవడంతో రాజస్థాన్ పతనం మొదలైంది. వైభవ్ అవుటైన తర్వాత ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు.
పవర్ ప్లేలోనే సగం మంది అవుటయ్యారు. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్ తొలి ఐదు ఓవర్లలోనే అవుటయ్యారు. వైభవ్ రెండు బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరగగా, యశస్వి జైస్వాల్ 6 బంతుల్లో రెండు సిక్సర్లతో 13 పరుగులు చేశాడు. నితీష్ రాణా 11 బంతుల్లో 9, కెప్టెన్ రియాన్ పరాగ్ 8 బంతుల్లో 16 పరుగులు చేయగా, షిమ్రాన్ హెట్మెయర్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దాంతో 47 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది…ముంబై ఇండియన్స్ బౌలర్లలో కార్బిన్ బాష్ తప్పించి అందరూ వికెట్లు తీసుకున్నారు. ట్రెంట్ బౌల్ట్ 2.1 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకోగా, జస్ప్రిత్ బుమ్రా నాలుగు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. దీపక్ చాహర్ రెండు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్లో రెండు పరుగులు ఇచ్చి ఒక వికెట్, కరణ్ శర్మ నాలుగు ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కి చేరుకుంది.